పుట:హరివంశము.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 8.

193

ఉ. తానును దైత్యులావునకుఁ దద్దయు మెచ్చుచుఁ బేర్చి దేవకీ
     సూనుఁడు కొమ్ము లూఁది మెడ స్రుక్కఁగ నెత్తి నులించి త్రిప్పి వే
     వే నెఱిదప్పఁ ద్రోచుటయు విహ్వలుఁ డై రుధిరంబు కర్ణనా
     సానయనంబులం దొరుఁగ స్రగ్గె విరోధి యపాప్తజీవుఁ డై.50
వ. ఇవ్విధంబున గోవిందబాహుయంత్రనిష్పిష్టుం డై పడియున్న యరిష్టుం జూచి
     యటమున్న విత్రస్త లై చెదరి యున్నగోపాంగన లందఱు విస్మయానందంబులు
     డెందంబులఁ దలిరుకొన నయ్యరవిందనాభుపాలికిం జనుదెంచి చుట్టును బలసి
     పలుదెఱంగులం బ్రస్తుతించి రట్టు వెన్నుండు వ్రేపల్లె బల్లిదుం డై వర్తిల్లుచున్న
     విధంబు దెల్లంబుగా వినుచు నక్కడఁ గంసుండు.51
తే. తోడుతోడుతఁ గడఁకలు దునిసిపడఁగ, వెఱఁగుపాటున వెఱపులు దుఱఁగలింపఁ
     జేష్టితంబులుఁ దలఁపులుఁ జేవసెడఁగ, నుసుఱుతోడన పీనుఁ గై యుడుకుచుండె.52
వ. ఇ ట్లుండి యొక్కనాఁడు సుప్తసర్వప్రాణిజాతంబును నిశ్శబ్దసకలదిక్తటంబు నగు
     నిశీధసమయంబున నభ్యంతరసభామండపంబున నొక్కరుండు నాసీనుం డై
     యుగ్రసేనుండు వసుదేవుండు సత్యకుం డంధకుండు గంపకుండు దారుకుండు
     విపృథుండు బభ్రుండు మొదలుగాఁగల యదుభోజముఖ్యుల నందఱ రావించి
     వారితో ని ట్లనియె.53
సీ. సర్వకార్యజ్ఞులు సర్వాగమములఁ బారగులు ద్రివర్గవర్తననిపుణులు
     లోకవిశ్రాంతివివేకనిష్టులు సమర్థోపాయు లవిరతోద్యోగధన్యు
     లభిగుప్తమంత్రు లనర్థంబులందుఁ బరాఙ్ముఖు లార్యభావానుగతులు
     దర్పితారాతిమర్దనశౌండు లార్తజనత్రాణతత్పకురుల్ నయసమగ్రు
తే. లందఱును మీరు వహ్నిసూర్యేందుపవన, రుద్రసమగుణోదయములరూఢిగనిన
     దొరలు నరులఁ జెప్పఁగ నేల సురల నైన, నోపుదురు బుద్ధిమగఁటిమి నుక్కుమడఁప.54
క. గిరులు మహీమండలమును, భరియించినభంగిఁ బరమభద్రం బగునా
     చరితంబు నఖిలయదుకుల, భరణం బొనరించి పేర్మిఁ బరఁగితి రెందున్.55
తే. ఇట్టి మీరు నా కెప్పుడు హితమ తలఁచి, యస్మదీయమనోవృత్తి ననుసరింతు
     రిప్పు డొకయనర్థము జనియించియుండ, మది నుపేక్షించినా రేమిమతమొ యెఱుఁగ.56

కంసుఁడు వసుదేవాదులతో శ్రీకృష్ణునిచరితంబు చెప్పి యాక్షేపించుట

వ. అది యెయ్యది యన నందగోపనందనుం డై యున్న కృష్ణుం డను పేరికుమా
     రుండు నాకపకారంబు సేయం బూనినవాఁ డద్దురాత్ముం డుపేక్షితం బై నరోగంబు
     పగిది ననుకూలానిలప్రేరితం బైన పయోధరంబు[1]చాడ్పున నంకురితం బైన
     విషవృక్షంబువిధంబున [2]వర్ధిల్లుచున్నవాఁడు నిపుణంబుగాఁ జింతించియు వాని
     పుట్టువుం బొడవు నున్న [3]రూపు నిశ్చయింప రాకున్నది యాశ్చర్యం బైన కారణం

  1. కరణి
  2. పర్ధించుచున్న
  3. రూప