పుట:హరివంశము.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ.8.

191

సీ. ధమ్మిల్లభరముల దందడిఁ దొరిఁగిన కుసుమంబులును జూర్ణకుంతలములు
     రాలిన కింజల్కరచనలు కర్ణచ్యుతము లైనబర్హావతంసములును
     హస్తవిస్రస్తంబు లైనమృణాళకంకణములుఁ గుచబంధగళిత లైన
     యలఘు[1]మౌక్తికవల్లరులు నితంబభ్రష్ట మైనయుజ్జ్వలమేఖలావళులును
తే. మృదులపల్లవశయ్యలుఁ బదసరోజ, [2]యావకాంకంబులును లేనియట్టియెడలు
     [3]లేవ యెల్లెడలందు బృందావనమునఁ, గృష్ణసంసక్త[4]పల్లవీక్రీడనముల.34
చ. అలరులు గోసి కోసిన వయస్యలఁ బల్మఱు గౌఁగిలించి కో
     యిలలయెలుంగు లోలిఁ గొని యింపుగఁ జిల్కలతోడ నెమ్మిమై
     నలవడ మాటలాడి యళు లాలతి సేయఁగఁ బాఱి డాఁగురిం
     తలు హరితోడ నాడుదురు తద్వనవీథులయందు గోపికల్.35
క. తరుణీపరివృతుఁ డై హరి, సొరనినికుంజములుఁ బ్రాఁకిచూడని చఱులున్
     దిరుగనినెత్తములును లే, వరయఁగ గోవర్ధనాద్రియంతటియందున్.36
క. నడకట్ట లిసుకతిప్పలు, మడలు దరులు వాఁకలును గ్రమంబున నొకటన్
     గడమవడకుండఁ గృష్ణుఁడు, పడతులకును యమున యాటపట్టుగఁ జేసెన్.37
సీ. తోరంపుటూరులఁ దొడరి యుద్ధతనితంబములపై నాదటఁ బ్రాఁకి నాభు
     లప్పళించి సమున్నతాంచితస్తనభరంబులు గౌఁగిలించి దోర్మూలములకు
     దొడఁకి భుజంబులతో బెనఁగాడుచు లీల మోవులు కబళించి చెక్కు
     లంటి కుంతలము లల్లల్లఁ దెమల్చి నేత్రములక్రేవలు విముగ్ధములు సేసి
తే. ప్రేతలకు నోలి నింపులు విస్తరింపఁ, దన్నపోలెడి కాళిందితరఁగలందుఁ
     గ్రాలె ననుదిన[5]మును జలకేళి దగిలి, సజలఘనమూ ర్తి గోపాలచక్రవర్తి.38
చ. ఎనసిననిండువెన్నెలల నింపగు రాత్రుల రత్నరమ్యకాం
     చనచషకంబులందు నరచందురునీడలు దోఁచుసీధువుల్
     గొని యదుసూనుచుట్టులను గూడి మదోద్ధతి నాడుగోపికా
     జనములు దార కైకొనిరి శారదవైభవలక్ష్మి యంతయున్.39
చ. తనుతరనిత్యపుష్పితలతాతతిలోనన యుండి నిద్ర మై
     దను బడి రేప మేల్కనునుదారమధువ్రతనాథుభంగి న
     వ్వనరుహనాభుఁడుం దగిలి వల్లవకాంతలలోన రాత్రులున్
     దినములు నట్లపోవఁగ సుదీర్ణసుఖాంబుధిఁ దేలె లోలుఁడై.40

శ్రీకృష్ణుఁడు వృషభరూపధరుం డగునరిష్టుం డనురాక్షసునిం జంపుట

వ. అంత నొక్కనాఁడు మధ్యరాత్రసమయంబున గోపికామండలమధ్యగతుం డై
     తారామధ్యంబునం బొలుచు సుధాకిరణుతోడం బురుడించుచు నభినవక్రీడా
     కౌతుకంబున నలరు కృష్ణునకు నరిష్టంబు చింతించి యరిష్టుం డనుదుష్టదానవుండు

  1. విమా క్తికములు
  2. యానకాండంబు
  3. లేవు దప్పిదమేన
  4. పల్లవ
  5. విభ్రమక్రమము మెఱసి