పుట:హరివంశము.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

హరివంశము

క. ఏవేషము దాలిచెఁ బ్రియుఁ, డావేషము దారుఁ దాల్తు రతఁ డేయింపుల్
     భావించి మెచ్చె వానికి, భావంబులయందు భ్రాంతి వడుదురు పడఁతుల్.22
తే. పిల్లఁ[1]గ్రోవి పట్టుచుఁ బసిపిఱుఁదఁబోవఁ, దారుఁబోదురు [2]రాగాన్యతంత్ర లగుచు
     నెరపుధూళులు మేనులఁ బొరసి యవియ, తొడవుగా గోపికలు కృష్ణుతోడఁగూడి.23
క. పిడియేనిక పదువు వొదవఁ, గడువేడుకఁ గ్రాలుగంధగజపతిమాడ్కిన్
     బడఁతులనడుమ యదూద్వహుఁ, డడవుల నొప్పారెఁ బటుమదాంధస్ఫూర్తిన్.24
వ. అమ్మహాప్రభావుండు నిజప్రభావిభవంబు ప్రసరించి.25

శ్రీకృష్ణుడు గోపకాంతల రతిక్రీడల నత్యంతానురాగవతులఁ జేయుట

క. అందఱకు నన్నిరూపులఁ గందర్పక్రీడ నేకకాలనియతి నా
     నంద[3]మయసామరస్యం, బొంద జలుపు [4]నోలి నొకత నొక్కత సూడన్.26
క. అదియు నదియు నే టిదియో, మది నెఱుఁగని కనని సొగపు మఱువనివలపున్
     బొదలఁగఁ గేవలదర్పో, న్మదలై క్రీడింతు రాసమస్తాంగనలున్.27
తే. ఒకత నొక్కత నెడపెట్టి యొకఁ డొకండు, దానునై మండలాకృతి[5]గా నమర్చి
     నడుమ నొకమూర్తితో వేణునాదలీల, నందఱను దేల్చు నందగోపాత్మజుండు.28
క. ఒక్కతె నొక్కతె దవ్వుగ, నెక్కడికేనిఁ గొనిపోయి యెలమి రమించున్
     దక్కినవనితలు దనబడి, నక్కడ నక్కడను నరపి యరసి భ్రమింపన్.29
క. ఎన్నఁడుఁ దక్కక కొందఱ, నన్నున నెక్కించుఁ జెంద కతిదీర్ఘముగా
     నన్నులఁ గొందఱను విరహ, ఖిన్నత నొందించు సమదకేళీవాంఛన్.30
సీ. ఒక్కతె దూతిగా నొకతపాలికిఁ బుచ్చి యంగజసంధికార్యంబు నడపు
     నొక్కతెయలుకకు నులికి సాంత్వనములు దగఁబల్కి యోర్తు మధ్యస్థఁ జేయు
     నొక్కర్తు బ్రియమున నొకచోటి కెలయించి వంచన మఱియోర్తు వలని కేఁగు
     నొక్కతెఁ జిక్కఁ బేరురమున నిఱికించి ముదమున నోర్తు కెమ్మోవి యాను
తే. నొకతెవలువకీ లెడలించి యోర్తుకడకుఁ, గొనుచుఁ బోయి యుల్లాస మింపొనరఁ గొఱలుఁ
     దనదుసౌభాగ్యగరిమ నందఱము నీసు, లేక చిక్కఁగఁ గృష్ణుఁ డుల్లోకలీల.31
మ. కరజక్షుణ్ణకుచద్వయీతలములన్ గాఢాగ్రదంతక్షతా
     ధరబింబంబుల నూతనాంగుళిదళధ్వస్తాలకాభోగబ
     ర్బరసీమంతములన్ ముకుంద తిధుర్యశ్రీలు గోపాలసుం
     దరులం దొప్పెఁ దదీయదుర్దమవయోదర్పానురూపోద్ధతిన్.32
తే. ఒకతెసంభోగచిహ్నంబు లోర్తు సూచి, వేడ్కపడ నప్పడంతికి వేఱభంగిఁ
     జేయు నదియు నొకతెకు వాంఛితముఁ బెనుపఁ, బెనుచుఁ గుతుకపరంపర ప్రియల కెల్ల.33

  1. గ్రోలు
  2. రాహస్య
  3. మయుఁడై రహస్యం
  4. నొకతె నొకతె బొలుపుగఁ గూడన్
  5. ఁదగనమర్చి.