పుట:హరివంశము.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

181


యడరినమీఁది మేఘతతి యావృతియై శిఖరంబు గుబ్బయై
కడుబెడఁగొందె హస్తమనుకామ దిరంబుగఁ దాల్చి పొల్చుటన్.

178


క.

కొండ ధరించుట నాకొక, కొండా [1]మున్ను నలవాటు కూర్మమనై పె
న్గొండ ధరింపనే యనున, ట్లుండె యదుతనూజుఁ డద్భుతోరుస్థిరతన్.

179


వ.

ఇట్లు గోవర్ధనుండు గోవర్ధనోద్ధరణంబొనర్చి సకలగోపాలసముదయంబు నాలోకించి.

180


శా.

ఈవానం బరిపీడ నొందుపసుల న్వీక్షించి రక్షార్థమై
వేవే యిద్ధరణీధ్రముం బెఱికితిన్ విస్తీర్ణ మీక్రిందు మీ
రేవా రెచ్చట నుండఁ గోరితిరి వా రెల్లం బశుశ్రేణితో
భావంబుల్ భయ ముజ్జగించి చొరుఁ డీభవ్యాద్రిచా టందఱున్.

181


తే.

బహుసహస్రసంఖ్యలు గలపసుల కెల్ల, నిడుపు దగినయి మ్మెయ్యది యిచట ననకుఁ
డెనసి త్రైలోక్యమును వచ్చెనేని [2]నిమ్ము, గలదు వెండియు వెలితియ కాఁగ నుండు.

182


వ.

అనిన నద్భుతరసప్రమోదంబులు వెల్లిగొనఁగ నాగొల్ల లెల్ల నార్చుచుం జెలంగి
దమతమకదుపుల నమ్మహాశైలమంటకంబు క్రిందికి నొండొండ పిలిచి సర్వభాం
డావళులును సకలశకటప్రముఖంబులును సమస్తవస్తువిస్తారంబులుం దెచ్చి
యునిచి బాలస్త్రీవృద్ధపూర్వకంబుగా నందఱుం దగిన యెడములు గైకొని నివా
తంబున సుఖంబుండి దామోదరమహిమాభికీర్తనంబునఁ దత్పరు లైరి [3]సప్తరా
త్రులు సమవసానంబు నొందినం బురందరుం డమందమందాక్షవిలక్షుం డై వలా
హకవ్యూహంబుల నుపసంహరించి మగిడి నిజలోకంబునకుం జనిన.

183


క.

నిర్మేఘత నాకాశము, నిర్మలమై ధౌతఖడ్గనిభమిది యనఁగా
నిర్ముక్తాసితభుజగస, ధర్మంబై యొప్పె నిజనితాంతచ్ఛాయన్.

184


క.

హరి గోవులు క్రమ్మఱ సం, చరించుటిట్ల యన నబ్దసంవృతి వాయన్
హరిగోవులు విశదములై, చరాచరమనోజ్ఞసంప్రచారత నొప్పెన్.

185


సీ.

[4]వాఁకలఁబడి నీరువలియఁ బాఱఁగ
మిఱ్ఱు లొండొండ బలసి తృణోత్కరముల
తుదలు పచ్చదనంబుతోఁ దలసూపంగఁ దీఁగ లొయ్యనఁ గొంకుదేఱి కొనలు
మొగ మెత్త మెత్తన యిగురాకు దోఁపంగఁ దరువులు దనిగాడ్పు తపనరుచులు
గాంచి సంప్రాణించి[5] క్రమ్మఱఁ గొమ్మలు గదలించి నర్తనక్రమ మొనర్ప


తే.

నెలవు లేర్పడి క్రుమ్మరునెరవు లెఱిఁగి, మృగకులంబులు భ్రమవాసి మెలఁగఁజొరఁగ
నాటవికకోటి తమజాడ లరసి తిరుగ, నడవు లొప్పారెఁ జండవర్షాత్యయమున.

186


వ.

తదనంతరంబ గోపాలదేవుండు గోపాలనోత్సరంబునం జరితార్థుం డై గోవర్ధన
ధరణీధరంబుఁ దదీయస్థానంబునంద యత్యంతసుస్థిరం బగునట్లుగాఁ బ్రతిష్ఠించి
గోవుల నభిమతమార్గంబులఁ బ్రవర్తింప గోపకుమారులం బనిచి.

187
  1. కొండయె
  2. యిమ్ము
  3. సప్తరాత్రంబు
  4. వాఁగులఁబడి
  5. సప్రాణించి