పుట:హరివంశము.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

179

పూర్వభాగము - ఆ. 7


మ.

ఇది కల్పాంతమొ యిమ్మహోగ్రసలిలం బేకార్ణవాకారమై
పొదలం జూచెనొ యింత[1]తోన జగముల్ పోఁజేసెనో ధాత యె
య్యది ది క్కెక్కడ సొత్తు మెవ్విధమునం బ్రాణంబు రక్షించుకో
లొదవున్ దైవమ యంచు గోపనివహం బుద్వేగ మొందె న్మదిన్.

165


మ.

భువనైకప్రభుఁ డైనయింద్రునకు సంపూజ్యంబుగాఁ జేయును
త్సవ మే నర్హుడనే హరింప నన కుత్సాహంబుతోఁ బూజ గొ
న్నవిహీనాత్ముని మేము సైప మనుచున్ శక్రాజ్ఞ గోవర్ధనా
ద్రి వెసం ద్రొక్కెడు నాఁగఁ జుట్టుకొని యుద్రేకించె జీమూతముల్.

166


క.

పసులకు నొడ్డి నవలయై[2], మసఁగినయవ్వాన పశుసమాజము[3] నెల్లన్
బసగరగొని యంతటఁ బో, క సమస్తప్రాణిబాధకం బై పేర్చెన్.

167


చ.

కులిశనిపాత[4]దాహమునఁ గొన్ని నశింపఁ బ్రచండవాయువుల్
బలువిడి వ్రేయఁ బెల్లగిలి భగ్నములై చెడఁ గొన్ని వెల్లువల్
బలియుటఁ బీడితంబు లయి పాడరఁ గొన్ని యశేషభూరుహా
వళులకుఁ దీవ్రదుఃఖదశ వచ్చె నెఱిం దదరణ్యభూములన్.

168


చ.

[5]నిడుజడిదాఁకి యెందుఁ జననేరక యాఁకటఁ గ్రుస్సి చెట్టుపల్
సడలఁ గులాయమధ్యమున శాఖలసందున నిల్వలేక యు
గ్గడువుగఁ బల్మఱుం జఱుచుగాడ్పునఁ దూలి వనంబుపక్షు లె
య్యెడఁ బడి చచ్చి తేలేఁ గడు నే పెసలారుపొలంపువెల్లువన్.

169


చ.

గిరికుహరస్థితంబు లగు కేసరులున్ జడిఁ బేర్చునప్పయో
ధరములగర్జలం బెగడి దందడి నున్నవి యున్నచోన య
చ్చెరువుగ గుండియ ల్వగిలి చేష్టిత మేమియు లేక యుండెన
ప్పరుసనివాస నన్యమృగపఙ్క్తులు మ్రగ్గుట చెప్ప నేఁటికిన్.

170


వ.

అట్టిసమయంబున నిరంతరధారాపాతంబునం దడిసి నలుదెసలం [6]బఱచి వ్రేయు
వాయువునఁ గొందలపోయి యొండొంటిచాటున కొదింగి కడగానక నిలువం
బడియుఁ గొమ్ములొడ్డి కన్నులు మోడ్చి కడఱెప్పల నీళ్లుగాఱం దలలు డిగ్గవైచి
నెమరు లుడిగి మూర్ఛలువోయిన ట్లుండియు [7]వడఁకు సొచ్చి యఱచుక్రేపుల
ముందటఁ బెట్టుకొని గంగడోళ్లం బొదువుకొని యంభారవంబుల నాక్రందించియు
వెల్లువకతనఁ డెంకిలేక నిలువుగా లుండియుండి యోటఱి కాళ్లు వడంక సైరణ
దప్పి నెఱిదప్పం బెనురొంపిలోనం ద్రెళ్లియుఁ బెలుచ మెఱచు మెఱుంగులం
జెదరి యదరంట నుఱుము పేరుఱుముల [8]బమ్మెరపోయి మందపట్లు విడిచి యిట్టు
నట్టునుం దెరలఁ దిరిగియు నాహారంబు లేక యీఁదచాటువడి మేయంజాలక

  1. తోడ
  2. వనియై
  3. మజముల
  4. ఘాతహతి
  5. నిడి, జఱిచి.
  6. జఱిచి
  7. దుఁనుకులు
  8. బమ్మరి