పుట:హరివంశము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

హరివంశము

ఇంద్రుఁడు మేఘముల రావించి వ్రేపల్లెమీఁద వర్షింప నియోగించుట

సీ.

వినుఁడు బృందావనంబున నందగోపుఁడు మొదలుగాఁగలగొల్ల ముదుక లెల్లఁ
గడుఁ గ్రొవ్వి తొల్లి యెప్పుడు నాకు నేఁ టేఁటఁ జేయు[1]పూజలు నేఁడు సేయనొల్ల
కుక్కివుఁ డైన దామోదరుకఱపులు విని యొక్కచిడిపిగట్టునకుఁ జేసి
రైన నింతన యేమి యయ్యె వారికి నెల్లబ్రతుకునకై యున్నపసికిఁ బెలుచ


తే.

నెడరు పుట్టెడునట్లుగా నేఁడునాళు, లొలసి రేయును బగలును వెలుతు రీక
వాతహతితోడ బెడిదంపువాన గురిసి, గాసి చేసి రండటు లైనఁ గరము మెత్తు.

157


క.

ఇదె యేనును మీవెనుకన, మదవన్మేఘద్విపేంద్రమస్తకరచితా
స్పదుఁడ నయి వచ్చి దివిఁ జూ, చెద మీయాటోప మెల్లఁ జెన్నెసలారన్.

158


వ.

అని పనిచినం బనిపూని వలాహకంబులు సమగ్రసన్నాహంబున నవ్యాహతో
త్సాహదోహలంబు లయెయే నట గోకులంబునందు.

159


సీ.

శివుదిక్కునందు వేకువఁ గోలమెఱుఁగులు మెఱసె నచ్చోన సమీరణుండు
వుట్టి తీవ్రత నేల బెట్టుగాఁ జఱచుచు విసరె బీఱెండతో నెసఁగె నుమ్మ
యీఁగ మిక్కుట మయ్యె నెఱనింగిఁ గడుమించె నిడుదలై తిలకించె నీరు కాళ్లుఁ
బడమట నిరుదెసం బ్రతిసూర్యములు దోఁచె నంబరంబునఁ బర్వె నాగడపలు


తే.

పిన్నబిడ్డ లెయ్యెడలఁ బింపిళ్లుగూసి, రంఘ్రితలములు సిమసిమయనియె జనుల
కఖిలతృణలతాతరునిచయంబుఁ జీడ, వట్టె నిట్టలంబుగ జడిపట్టుపొంటె.

160


క.

సురపతిది క్కుఱిమెడు భూ, ధరములవెలిమొగులు గప్పెఁ దప్పదు వర్షం
బరు దిది యకాలమున నని, దొరకొని చింతిలిరి గొల్లదొరలెల్ల మదిన్.

161


వ.

తదనంతరంబ.

162


సీ.

దిక్కరిణీబృంద మొక్కట యీనినపిల్లలు దివిఁ బ్రసరిల్లె ననఁగ
గోత్రాచలంబులు చిత్రవాతాహతి వెసఁ బెల్లగిలి మీఁద వెలసె ననఁగఁ
బాతాళమున నున్న బంధురధ్వాంతముల్ వెడలి భానుని మ్రింగ నడరె ననఁగ
నిల నాల్గుచెఱఁగుల జలధులు నలిరేఁగి కడళుల నభ మెక్కఁ గడఁగె ననఁగ


తే.

నొప్పి యుద్ధురస్థూలపయోధరములు, దెసలకడపట[2] బొడమి యాకసము మూసి
మెఱుఁగు[3]జోతులు చూడ్కికి మిక్కుటముగఁ, నొదవెఁ బిడుగులు రాలును నుప్పతిల్లె.

163


మ.

వడి నమ్మేఘచయంబులం దొరఁగు దుర్వారోద్యతాసారముల్
వడగండ్లున్ బెరయంగఁ దీవ్రనిసరద్వాతూలముల్ గూడి దం
దడి దోడ్తోడఁ బ్రవృద్ధిఁ బొంద బలువై ద్యావాపృథివ్యంతరం
బెడ మొక్కింతయు లేక యుండఁగఁ గరం బేపారె నాపూర్ణతన్.

164
  1. నుత్సవమునుఁ జే
  2. కడపళ్ల
  3. బోదలు