పుట:హరివంశము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

173


మ.

తెలినవ్వు ల్వెలిదమ్మి నెమ్మొగములం దీపార నేపారుచూ
పులు దారై మదలోలభృంగరచన ల్పొల్పార వీచీభుజా
వళి యాలింగనకేళి కుత్తలపడన్ వార్దిం దగం గూడుచోఁ
గలక ల్దేఱి తనర్చె నేఱులు శరత్కల్యాణకల్యాకృతిన్.

112


ఆ.

పిదుకఁ గొలఁదిగాక పెయ్యలు దనిసె వ్రే, పల్లెపసులు సేఁపి పాలు గురియ
నడరి పాలవెల్లి యయ్యె నా నెందు వి, కాసకాశవనవిలాస మెసఁగె.

113


క.

బంధూకతిలకములు సౌ, గంధికకర్ణావతంసకంబులు నుద్య
ద్గంధినవోత్పలకుచతట, బంధురభూషలును గోపభామల కమరెన్.

114


క.

తారకితగగనచక్రము, తో రాసె ననంగ రేలు తొగపువ్వుల నొ
ప్పారే విపులనిర్మలకా, సారంబులు సారసప్రసరసేవ్యములై.

115


తే.

అలరు వావిలిపూఁదీగె లలమికొనిన
చలువచోటులఁ గ్రుమ్మరుజడనుగాడ్పు
మొగులువిరియెండ దళుకొత్తు మొగము చెమట
లార్చి పొలముగొల్లలకు మెచ్చై తలిర్చె.

116


క.

ఏడాకుపొన్నకొమ్మలు, గోడాడెడునడవి [1]గౌరుకొదమలు మోద
క్రీడఁ దనరుచాడ్పునఁ బై, నోడికలయి పువ్వుఁదేనె లురులఁగ నొప్పెన్.

117


క.

అసనంబులు మదనునియి, ష్వసనంబులపోలె విరహు లగువారి కతి
వ్యసనం బొనర్చి [2]వికస, త్ప్రసవశిలీముఖనితాంతపటుపాతములన్.

118


ఉ.

శారదచంద్రిక ల్వితతచారుమహోత్సవ లయ్యె గోపక
న్యారమణీయగీతుల నుదంచిత[3]ధేనువిదోహనధ్వని
స్ఫారతలన్ సదర్పవృషభవ్యతిగర్జితలీలల న్మహో
దారరతీశ్వరప్రియకథారుచులన్ వ్రజభూమి నెల్లెడన్.

119


వ.

ఇట్టి శరత్సమయంబునం బ్రమదతరంగితంబు లగునంగంబులు నంతరంగంబులుం
గలిగి గంగాతరంగంబుల తెఱంగున ననంగదమనహాసవికాసంబులచాడ్పున నమృత
పయోధిఫేనపటలంబులపగిదిఁ గర్పూరక్షోదపుంజంబులపొలుపునం జందన
పంకకూటంబులకైవడిం జంద్రప్రభాపూరంబులపరుసునం గుముదచ్ఛదవిసరం
బులవిధంబున ముక్తామణిసముత్కరంబులకరణి సతిధవళంబు లై శైలంబులం
బోలె నుచ్ఛ్రితశృంగంబులు మహాతరువులుంబోలె బంధురస్కంధంబులును [4]జంద్ర
కిరణంబులుంబోలె సర్వదిగ్వ్యాపకంబులుఁ గృతయుగధర్మంబులుంబోలె నఖం
డితసంచారంబులు శంకరవిహారంబులుంబోలె ననపేతవృషంబులు శ్రుతివిభవంబు
లుంబోలె లోకోద్ధారకంబులు విష్ణుకీర్తనంబులుంబోలె శ్రవణమంగళంబులు
నధ్వరోత్సవంబులుంబోలె దర్శనపావనంబులుఁ బుణ్యతీర్థంబులుంబోలె నిత్యనిర్మ

  1. కారు
  2. ప్రసవ, త్ప్రసభశిలీముఖ . . .
  3. వైణుక సారస, (పూ. ము.)
  4. రవి