పుట:హరివంశము.pdf/217

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

169


వ.

అమ్మహాగహననిరంతరదురంతకాంతారంబునందు.

72


ఉ.

ఏదెస చూచినం బొదలి యింపెసలారెడునాతృణోత్కరం
బాదటవోవఁగాఁ గదుపు లన్ని యుఁ జెన్నుగ నిండి మేయ దా
మోదరముఖ్యగోపతతి యొక్కట యాతృణరాజషండ మా
మోద మెలర్పఁ జొచ్చి మనముల్ దనియన్ విహరించి రెల్లెడన్.

73


వ.

అప్పుడు.

74


శా.

కాలాహుల్ [1]ఋజుతావిచిత్ర మగుభోగశ్రేణి శోభిల్లఁ బా
తాళం బొక్కట నిర్గమించి [2]విలసద్దర్వీవికాసంబుతోఁ
గేళిం గ్రాలెడినో యనంగఁ దనువుల్ గృష్ణంబులై యొప్పఁగా
ఖేలన్మూర్ధము లైనతాళతరువుల్ కృష్ణుండు వీక్షించుచున్.

75


వ.

రోహిణీనందనువదనంబు గనుంగొని యి ట్లనియె.

76


మ.

క్రమపాళంబునఁ గెంపుతోడినలుపెక్క న్మిక్కుటం బైన గం
ధము దిక్కుల్ సురభీకరింప రస మంతర్గామి యయ్యు[3]న్వెలిం
గమియం గాఱుచునున్నచాడ్పున విలోకప్రీతి గావింప హృ
ద్యములై యున్నవి చూచితే ఫలము లీతాళద్రుమశ్రేణులన్.

77


తే.

వీని [4]నింపార గోవులు నేను గూడి, యెలమి యెలయ నాస్వాదింతు మెంతయేని
వేడ్క యయ్యెడు రాల్పుము వేగవేగఁ, బ్రాఁకి నీలావువెరవు సంభావితముగ.

78


వ.

అనిన నవ్వీరుం డవ్విధంబున కియ్యకొని గోపకుల నందఱు గలయ నాలోకించి.

79


క.

ఎక్కఁ దడవు త్రాళుల మొద, లక్క జముగఁ బట్టియూఁతు నవి యేఱికొనుం
డెక్కుడుగఁ బండ్లు మీరొ, క్కొక్కని గడువంగఁ జనుచు నుద్ధతలీలన్.

80


తే.

ఒక్క తరవాయి దొరకొని యొకటినొకటిఁ
బృథుభుజాదండములఁ బట్టి పెలుచనూఁచెఁ
బెఱుక విఱువను నొల్లక యుఱక వన్య
హస్తి నిజహస్తమునఁ జెరలాడునట్లు.

81


క.

పరుసని గాడ్పున రాలెడు, వరుసున ధరఁ దొఱుఁగు, త్రాటిపండుల మ్రోఁతల్
పొరిఁబొరి గోపకుమారుల, యురుహర్షధ్వనులుఁ గూడి యొక్కట నొదవెన్.

82

బలరాముండు గర్దభవేషధారి యగుధేనుకుం డనురాక్షసుం జంపుట

వ.

 అమ్మహాఘోషంబునకుం గలుషించి ఘోరభుజశక్తిఘోషణుండును ఘోషజన
నిత్యభీషణుండును సంత్రాసీతధేనుకుండు నగు ధేనుకుండు గర్దభరూపంబు దాల్చి
దుర్గము లగు దైత్యులు తాదృశాకారు లై సహస్రసంఖ్యులు తోడ నడువ రామ
కృష్ణులకుం గీడు సేయుతలంపునఁ దెంపు మిగుల నడతెంచినం గని సకలగోపా
లురు నేపు దక్కి యక్కడక్కడన స్రుక్కి. రంత.

83
  1. రుచితా
  2. వికసద్దర్భీ (పూ. ము.)
  3. న్నెఱిం
  4. నీవేళ