పుట:హరివంశము.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

హరివంశము


తే.

యఖిలజనులకు నధికసేవ్య[1]ంబుగాత, మత్పదాంకము లయిన నీమస్తకములు
సూచి గరుడండు నీకు నెచ్చోట నున్న, ననఘ యెప్పుడుఁ గీడు సేయంగ వెఱచు.

61


వ.

ఇది వరంబుగా నిచ్చితిం బొమ్మనినఁ గాళియుండు గోపాలు రందఱుం జూడ
గళత్రపుత్రభృత్యసమేతంబుగా వెలువడి సముద్రంబున కరిగెఁ గృష్ణుండును
యమునాహ్రదంబులోన నుండి నిజేచ్ఛావిహారతృప్తం బై వెడలునుద్దీపదంతా
వళంబుపగిది వెలువడి వచ్చిన నెదురువోయి.

62


క.

 తల్లియుఁ దండ్రియుఁ బ్రమదము, వెల్లి గొనఁగఁ గౌఁగిలించి వేదీవన లీ
నుల్ల మలర నతఁడును బ్రణ, మిల్లి సమాశ్వాసవాక్సమితి పచరించెన్.

63


వ.

అంత నఖిలగోపాలురు నద్భుతప్రమోదమేదురహృదయు లగుచు నతని చుట్టును
ముసరికొని బహువిధంబులం గీర్తించుచు నభినందింప నందగోపాదివిశిష్ట
జనంబు లతని కిట్లనిరి.

64


ఉ.

ఎన్నడు నిట్టిసాహసము లిట్టిబలోద్ధతు లిట్టిధైర్యముల్
విన్నవి కన్న వెయ్యెడల వీరకులోత్తమ కల్గనే జగ
త్సన్నుత మయ్యె నీమహిమ సర్వధనంబులు గోపకోటియున్
నిన్ను శరణ్యుఁగాఁ బడసె నేఁడు మొద ల్పతి వీవ యంతకున్.

65


క.

ఎచ్చోటనైనఁ దమతమ, యిచ్చఁ జొరంగనియె గోవు లియ్యేట మునుల్
విచ్చలవిడిఁ దఱియుదు రీ, యచ్చపుఁబుణ్య మిటు నీకు నబ్బునె యనఘా.

66


తే.

అడవిఁ బుట్టిన[2]మ్లేచ్ఛుల మగుట మాకు, నిక్కమయ్యె నిమ్మెయి నిప్పునీఱువొదివి
నట్టులున్న మహాభూత మైననిన్ను, నెఱుఁగ మింతగాలము నిట్టికొఱఁత గలదె.

67


వ.

అని పలికి యతనికిం బ్రదక్షిణంబు [3]లాచరింప నతండు వారి నయ్యైవిధంబుల
నుపలాలించె నిట్లు సంభావితుం డైనయావీరుండు పురస్సరుండుగా నందఱు
వచ్చి వ్రేపల్లె సొచ్చి సుఖంబుండి రవ్విధంబునం గాళియభుజంగభంగంబు నివృత్తం
బైనయనంతరంబ యొక్కసమయంబున.

68


క.

పసులకు మే పెద్దడియై, పసచెడి పొల మెల్లఁ [4]బొసుఁగుపడి యుండఁగ గో
పసమేతంబుగ వసుదే, వసుతుఁడు చింతింపఁ బ్రౌఢవల్లవులు దగన్.

69


వ.

గోవర్ధనపర్వతంబునకు నుత్తరభాగంబునం గాళిందీపరిసరంబున సమతలంబును
గృష్ణమృద్భూమికంబును సంపన్నబహుళతృణోపజాతంబు లగుతాలవనం బతి
విశాలం బై గర్దభరూపధారి యగుధేనుకుం డనుదానవుచేత నాక్రాంతం
బగుటం బ్రాణు లెవ్వారికిం జరిం రాక [5]పాడఱి యుండు నని ప్రసంగింప రామ
కేశవు లక్లేశం బగుదర్పావేశంబున నుత్సహించి.

70


తే.

పసికి మేపు గల్గినఁజాలు నసుర లేమి, నేసెదరు పోవనిం డని చేయఁగలుగు
గొల్లలకు నెల్లఁ జెప్పఁగా గోగణముల, వెలిచి రార్చుచు నద్దెసఁ జెలఁగివారు.

71
  1. మగుఁగాక
  2. ముచ్చుల (పూ. ము)
  3. లు చేసి (పూ. ము.) రవ్విభుండును
  4. త్రొక్కువడి. (పూ. ము)
  5. సారడయై