పుట:హరివంశము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

హరివంశము


బాముతోడ నెఱలావునం బెనంగి కుమారు విడిపింతము గాకున్న నతనితోడిద
లోకంబుగాఁ గాళియ కాలాహి యనుకాలునిపాలువడి చిక్కుదము చంద్రవిర
హిత యైనవిభావరివిధంబున భానుహీన యైనగగనవీథిచాడ్పున వృషభంబు
వెలి యైనగోవితతితెఱుంగునఁ గృష్ణుండు లేనివ్రేపల్లె కెత్తెఱంగున మరలిపోద
మిదియతెం పిట్లు చేయుద మని యుత్సహింప వారలయార్తియు వనజనాభుదు స్స్థి
తియుం జూచి విష్ణుతేజంపుఁ బెఱమూర్తియై యభేదజ్ఞానంబు నిజబుద్ధి నిరూఢం
బుగా నెఱుంగు బలభద్రదేవుండు వాసుదేవుం దలఁపింపఁ దలంచి యొక్కరుం
డును దొలంగి నిలిచి గంభీరమధురస్వరంబున ని ట్లనియె.

43


ఉ.

మానుషభావ మిట్లొకఁడు మాటిడి లోకహితం బొనర్పఁగాఁ
బూనిననీమహామహిమబుద్ధిఁ దలంపక యిప్పు డిచ్చటన్
దీనికి నింత స్రుక్కఁబడి దీనత నొందుట మెచ్చుగాదు నీ
దైనయనుంగులందఱును నార్తిఁ గలంగుట కృష్ణ! చూచితే.

44


వ.

వీరు నీసత్త్వం బెఱుంగరు గాన శోకించెదరు జన్మసముచితంబు లగుకర్మంబు
లప్రతిహతంబులుగాఁ జెల్లించెదవు గావున బంధుప్రమోదం బవశ్యకర్తవ్యం
బివ్విషాహి మర్దించి యీదర్దశ నపనయింపు మనినరౌహిణేయువాక్యం బాకర్ణించి.

45


శా.

ద్వైతభ్రాంతినివృత్తిఁ బొందఁగ నభేదబ్రహ్మబోధంబు సం
భూతం బైన నశేషబంధనములం బోఁద్రోచుసిద్ధాత్మున
ట్టాతం డమ్మెయి నాత్మతత్త్వవిదుఁడై యప్పాపచుట్ట ల్విని
ర్ధూతిం బొందఁగ నీల్గి బిట్టు నెగసేం దోయౌమధ్యంబునన్.

46


వ.

అట్టి యుత్సాహంబు నిర్వ్యపోహంబుగాఁ బేర్చి.

47


ఉ.

కాళియభోగిపుంగవు నఖర్వసుదుర్వహగర్వధుర్యతం
గ్రాలెడుమిక్కుటంపుఁబడగ ల్వెస నైదిటిమీఁదికి న్మహా
భీలవిచేష్టమై నుఱికి [1]పెల్చఁ దదీయవిలోలపుచ్ఛముం
గేల నమర్చి నొంపఁ దొడఁగెం బటుపాదనిపాతనంబులన్.

48


మ.

యమునావీచి మృదంగ వాద్యములు మ్రోయం దీరగోపౌఘహ
ర్షమనోజ్ఞధ్వనితంబు గేయముగఁ జంచత్కాళియవ్యాళభో
గమహారంగతలంబునం బటుగతిం గంజాక్ష[2]నిర్మర్దనా
ట్యము హృద్యాద్భుతభీమ మై పరఁగ దివ్యశ్రేణి చూచెన్ దివిన్.

49


మ.

వెస దామోదరుపాదఘాతనగతుల్ వేవేలచందంబులం
బ్రసభాటోపముఁ జూపఁ[3] బాపఫణభృత్ఫాలచ్చటా[4]మండలం
బసహంబై [5]నొగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ శోణితం
బెసఁగన్ దంష్ట్రలు నుగ్గుగా గరళవహ్ని[6]జ్వాలికల్ వెల్వడన్.

50
  1. వ్రేలు
  2. నిర్మధ్య (పూ. ము.)
  3. జూప. (పూ. ము.)
  4. మర్దనం. (పూ. ము.)
  5. నశిరోమణుల్
  6. జ్వాలముల్ పైపడన్ (పూ. ము.)