పుట:హరివంశము.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

163


క.

విషదూషితులము హరిఁ గ, ల్మషరహితుని నంట వశమె మాకు ననుచు ని
ర్విషయతఁ దొలంగుగతిఁ ద, ద్విషమోర్ములు తీరములకు వెసఁ దోతెంచెన్.

15


క.

కాళియమర్దనమునకుం, గాలాకృతిఁ గృష్ణుఁ డుఱుకఁ గన్మొఱఁగి మహా
వ్యాళములు వెడలఁబాఱెడు, పోలికఁ దోడయ్యె దరులఁ బొందుతరఁగలున్.

16


వ.

ఇత్తెఱంగున నాక్రాంతసలిలుం డై యయ్యదుకుమారుండు.

17


ఉ.

ఆదివరాహ మై తనయుదంచితపోత్ర మమర్చి కల్పవి
చ్ఛేదవృద్ధతోయ మగుసింధువుఁ జొచ్చి కలంచినట్టియు
న్మాదమ పొందె నాఁగ భుజమండలమున్ సవరించి కొంతసే
పాదట నమ్మహాతటి నియంబుతతిం గలఁగుండు వెట్టఁగన్.

18


తే.

అతఁడు కరములఁ దోయ మందంద చఱచు,ఘోరనినదంబు నతనిహుంకారరవముఁ
దత్పదాగ్రపాతోత్థితధ్వనియు నొక్క, మ్రోఁత యై పేర్చి దిగ్భాగరోధి యయ్యె.

19

కాళియుండు శ్రీకృష్ణునిం గఱచి చుట్టుకొనుట

వ.

అట్లు నిజనివాసం బగునజ్జలాశయంబు సంచలితం బగుటకుం గలుషించి.

20


సీ.

తనఫణావలి గలంతయు విచ్చి యెత్తిన గగనంబు సర్వంబు గబళితముగఁ
దనమిక్కుటపుఁగోఱ దౌడలు దెఱచిన విసపుఁజి చ్చొండొండ దెసలు వ్రేల్వఁ
దనచూడ్కు లుగ్రంపుఁగినుకతోఁ బర్విన నంబరచరకోటి యార్తిఁ నొదుఁగఁ
దన మేను మలఁక లై తనరారి [1]నిగిడిన యమునయంతయుఁ దన్మయత్వ మొందఁ


తే.

బొదలు తనఫూత్కృతుల నెల్ల బొగలు గవిసి, యబ్జజాండ మూదరవెట్టినట్లుగాఁగఁ
గాళకర్కశకాయుండు కాళియుండు, గవిసె గోపాలబాలుపైఁ గసిమసంగి.

21


వ.

కవిసి పొదివి యుఱక నెఱఁకు లందంద కఱచి యతని కెయ్యదియుం జేయఁ
దెఱపి యీక యుద్రేకంబునం గిట్టి.

22


క.

ఆపాదమస్తకంబుగ, నాపురుషోత్తమునిదేహ మాభుజగేంద్రుం
డాపూర్ణభోగబంధన, తాపాయత్తముగఁ జేసెఁ దత్క్షణమాత్రన్.

23


ఉ.

పూర్వభవంబునం బ్రబలభోగిమహాస్త్రనిబద్ధుఁ డై మయా
గర్వుఁడు వైరిచే రణముఖంబునఁ గొండొకసేపు పడ్డయా
దుర్విధి నేఁడు నెమ్మెయిఁ గుతూహల మె త్తియొ తాల్చె ని ట్లనన్
సర్వవిభుండు కాళియభుజంగనిబంధన నొప్పె నయ్యెడన్.

24


తే.

సింధుపతిలోనఁ బెనుబాపసెజ్జఁ బెనఁగి, [2]సుప్తిఁ గడునొప్పుతీ పాత్మ సోఁకి యిట్టిఁ
డయ్యెఁగాక యెక్కడిపీడ హరి కనంగఁ, బన్నగాంగసంగమమూర్ఛ ప్రభున కొప్పె.

25


ఉ.

కాళియుచుట్టలుం జెలులుఁ గాంతలుఁ బుత్రులు నైనదుర్దమ
వ్యాళము లెన్ని యన్నియును నప్డు వసంబఱి యున్న శౌరి నా

  1. నిగుడంగ
  2. సుప్తి కడునొప్పు దేవాత్ముఁ జోకి యిట్టి డయ్యెఁగాక—ఁ, బన్ను గానంగ మూర్ఛ దాఁ బ్రభున కొప్పె. (పూ. ము.)