పుట:హరివంశము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

హరివంశము


నఖిలభూతంబులం దర్జించు గర్జాఘోరం బగువిలయపర్జన్యాకారంబుకరణిం
గాఱుకొనుచున్న యొక్కమహాహ్రదం బాలోకించి యాత్మగతంబున.

6


శా.

కాలాకారుఁడు కాళీయుం డనుమహాగర్వుండు దర్వీకరుం
డాలోలాగ్నికరాళవక్త్రుఁడు విహంగాధీశసంత్రస్తుఁడై
కాళిందిన్ వసియించు నన్ పలుకు నిక్కం బెప్పుడు న్విందు నా
భీలం బిమ్మడు వద్దురాత్మునెల వుత్ప్రేక్షింప నేభంగులన్.

7


ఉ.

రాహుగృహీత మైనయుడురాజుశరీరమపోలెఁ దద్విష
వ్యాహతి నిమ్మహాజలము వైభవ మేదిన దిప్డు వీతసం
దేహతఁ జొచ్చి యయ్యురగుతీవ్రమదంబు మెయిన్ వెలార్చి గో
గాహనయోగ్యమై వెలయఁగా నొనరించెద నీప్రదేశమున్.

8


వ.

అమ్మహాపన్నగుపరిజనంబు లగుభుజంగంబు లెందునుం గ్రందుకొనం దిరుగుట
నీబృందావనంబునందు నెలవు లెడనెడ నతిదుస్సంచరంబు లయి యుండుం గుటి
లాచారు లగుసరీసృపాధములు కొందఱు గోరూపంబుల నస్మదీయులలోనం
గలసి నాకుం గీడొనర్ప రోయుదురు తదీశ్వరుండు నిగృహీతుం డగుట నయ్యం
దఱ విత్రస్తులం గావించుట గావున [1]నిం కేల యాలస్యం బెట్లునుం జేయుదు
నిదె కదంబవిటపి యొక్కటి యుత్కటోరగవిషంబున విషాదంబు నొంది
యియ్యుత్తమతటినీతటంబున నున్నయది.

9


తే.

ఇది మదీయపదస్పర్శపదవి గాంచి, యఖిలలోకనమస్కార్య[2]హారిమహిమ
నూర్జితం బగుఁగాత యింపొనర దీని, నెక్కి యిన్నీట నుఱికెద నక్కజముగ.

10


వ.

అనుచుం గుతూహలంబున.

11


ఉ.

ఎవ్వరితోడఁ జెప్ప కొకయింతయు మంతనమాడ కేమియో
యివ్విపుల[3]ప్రయత్న మితఁ డిప్పు డొనర్చుటకున్ నిమిత్త మం
చవ్వల నాబలప్రభృతు లాత్మఁ దలంప నకంపలీలమై
నవ్వనజూక్షుఁ డాక్షణమ యల్లన నవ్వున మో మెలర్పఁగాన్.

12


సీ.

[4]ఒడిసిక్కు గొనఁ జెక్కి మడిసంది నునిచినతలుగులుఁ ద్రాళ్లులు దొలఁగవైచి
డా కేలఁ బట్టిన ఢక్కయుఁ జంకఁ దాల్చినవేణువును నన్యుచేతి కిచ్చి
పొలుచుపింఛపుదండ వుచ్చి వెండ్రుకల నొప్పెడుజడగా నల్లి ముడి యమర్చి
మొలఁగచ్చకట్టుపై మలఁగినపచ్చ, నునుగొంగు దిండుగా నునిచి చుట్టి


తే.

చెప్పు లూడ్చి కదంబకస్భీతతరువుఁ, బ్రాఁకి పెడబొబ్బయిడి యార్చియాఁకగొనక
[5]మడువులోనికి నుఱికె నున్మత్తలీల, నెగసి తత్తోయకణములు నింగిఁ బొదువ.

13


తే.

మందరాద్రిపాతమున నమందచలన, మొందుజలరాశిమాడ్కిఁ బయోజనాభు
ఘోరలంఘనమునను సంక్షుభిత మయ్యె, నారసాతలాంతరముగ నాహ్రదంబు.

14
  1. నింక నేల
  2. యైనగరిమ
  3. యివ్వలన
  4. తోడి సిక్కగొనఁ బెక్కియడిసంది నులిచిన (పూ. ము.)
  5. మడువులోనికి నుఱికి యున్మత్తులీల నెగసెఁ దత్తోయకణములు నింగి వొదువ (పూ. ము.)