పుట:హరివంశము.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 6

153


మ.

హరి యేతెంచు టెఱింగి కట్టలుకతో నామాయపోతు ల్వడిన్
ఖురశృంగంబులఁ గుంభకవ్రజములో గోగర్భిణీవత్సశా
క్కరసంఘంబులఁ బెక్కిటిం బొడిచి రక్తంబుల్ భువి న్నింపఁగాఁ
దెరలంబాఱెఁ గలంగి గోవులు గడున్ దీనంబు లై రోలుచున్.

140


సీ.

అంతఁ బోవక యవి యాగోపముఖ్యులోగిటిలోని కుఱికి యక్లేశలీల
ఱంకెలు వైచుచుఁ గింకఁ [1]గాల్ ద్రవ్వుచుఁ జిమ్ముచు నొండెడఁ జెలఁగి చెలఁగి
భాండసంభారంబు పగులించి గోడలు గోడాడి గరిసెలు కూలఁ దాఁకి
బండులు విఱుగంగఁ బైదాఁటి పందిళ్లు పడఁద్రోచి తలుపులు వగుల నొత్తి


తే.

యాఁడువారును శిశువులు నార్తినొంద, నెక్కడెక్కడ యని వాడలెల్లఁ గలుఁగఁ
గూడి త్రుళ్లెడుపరదేశిగొల్లకొమరు, లిందు నందును నొదుఁగంగ నేపు సూపె.

141


వ.

అంతఁ బ్రభాతం బగుటయుఁ గుంభకుండు సకలగోపాలురం గూడఁ బిలుపించి
కూఁతునకు శృంగారంబు సేయించి తెచ్చి తత్సమీపంబున నునిచి నందగోప
సహితుం డయియుండి కృష్ణపురస్సరు లగుతదీయులు నన్యులు విన ని ట్లనియె.

142


ఉ.

గోపకుమారులార కనుఁగొంటిరె గోవృషముల్ దిశాగజేం
ద్రౌపమము ల్మహాగిరిగుహోత్థితసింహసమానము ల్కన
త్కోపకృతాంతతుల్యములు దుర్గమముల్ దమియింప [2]వీని మే
మోపక యిట్లు చిక్కితిమి యోగ్యపుయత్నము లెన్ని సేసియున్.

143


క.

కేవలగోవృషభంబులు, గా వివి రాక్షసులొ యొండె గంధర్వులొ య
క్షావలిలోనివొ హింసయ, కావింపఁగ బుట్టినవి జగంబున నెందున్.

144


తే.

వీని దండింపకున్నను మానవేంద్రుఁ, డలుకతో మమ్ము దండింతు ననియెఁ గాన
దలఁకి కూర్చితి నిట్టు లందఱును మీరు, సత్త్వవంతులు విక్రాంతితత్త్వవిదులు.

145


వ.

కావున వీని మర్దింప నోపినవాఁ డొక్కరుండ యిక్కన్నియకరపంకజం బాక్ష
ణంబ కైకొనువాఁ డని జనకుండు జానకీశుల్కం బగుశంకరశరాసనదమనం
బుదాహరించినవిధంబున నిరూపించిన కుంభకవాక్యంబు నాఁటిభూపాలురపగిది
గోపాలు రందఱు నాకర్ణించి.

146


శా.

నీలం జూచుచు మన్మథాస్త్రముల కున్మేషంబు లై డెందముల్
సాలం గౌతుక మొంద గోవృషములం జర్చించి యాభీలకా
లాలంఘ్యోద్ధతచండదండహతి కత్యాతంకముల్ పైకొనన్
డోలాందోళితచిత్తు లైరి మదిఁ దోడ్తో[3]ఁ దెంపు సొంపారఁగన్.

147


వ.

ఇట్లు చిత్రవిన్యస్తదేహులపోలె నిరుత్సాహులై నిశ్చేష్టభావంబునఁ జూచు
చున్నవారలం జూచి నందగోపజ్ఞాతి యగుఘోషవంతుం డను గోపకుండు.

148
  1. గారింపుచు
  2. నేరికే
  3. భీతు లొప్పం దగన్