పుట:హరివంశము.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము. ఆ. 6

151


వ.

ఇట్లు పెరిఁగి త్రైలోక్యరత్నం బిది యనువర్ణనలకుం గగిన వరవర్ణినీతిలకం బై
యున్నయన్నాతి ననేకగోపాలకుమారు లడిగి యడిగి నిలిచి రట్టియెడ.

121


తే.

తారకామయరణమున వారిజాక్షు, కడిమి నిహతులై యేడ్వురు కాలనేమి
కొడుకు లాపగ మనసున [1]నిడి పొడమిరి, కడిఁదియాఁబోతులై కుంభకవ్రజమున.

122

కాలనేమిపుత్రు లేడ్వురు గుంభకునింట వృషభంబులై పుట్టుట

వ.

ఇట్లు జనియించి.

123


క.

పోరానిచుట్ట మితనికి, శౌరి యిచటి కెల్లభంగిఁ జనుదెంచుఁ జలం
బార నతని వధియింపఁగ, నేరూపున నైన మాకు నిచ్చట నొదవున్.

124


వ.

అని తదాగమనకారణంబు లగునుపాయంబులు చింతించి యఖిలజనబాధకుం
దొడంగి.

125


సీ.

ఎదిరినపోతుల నెవ్వానినైన నవారణ నోడించి వలియఁ దోలు
నిలిచినఁ జంపు మందల నెందుఁ దిరిగి క్రేపుల మొదవులను జాఁబొడుచుఁ బట్ట
నడువంగ వచ్చిన నదటునఁ జిందఱగొని యెట్టిబలియురఁ గొనక కవియు
నీటిలోఁ [2]దఱిసినపాటీనములగతి వెలుఁగులు సొచ్చి యావలికిఁ బోవు


తే.

గోడ [3]లలవలు వెసదాఁటు గ్రీడవోలె, రేలుఁ బగళులుఁ దిరుగుచుఁ జేలపంట
లొకఁడు లేకుండ మేయుఁ గాపున్నవారి, నుఱికి పొరిగొనుఁగడిఁది మృత్యువులువోలె.

126


వ.

అంత నవ్విదేహదేశంబునఁ గల కృషీవలు లెల్లం గూడి రాజుపాలికిం బోయి
చక్కఁ జాగిలి మ్రొక్కి లేచి నిలుచుండి చేతులు మొగిడ్చి.

127


తే.

కుంభకునిమందఁ బుట్టినగోవృషంబు, లేడు నీభూమిసస్యంబు లెల్లఁ జెఱిచె
గావ నలవిగా దెవరికి దేవ [4]యెరకుఁ, జెడితి మరయఁగ వలయు మాచేటు నీవు.

128


క.

జముఁ డైన వచ్చి వానిని, దమియింపఁగ లేఁడు నిశ్చితం బేమియుపా
యము గలదొ చూడు నీభా, వమునం దిటఁ బ్రజలు మీకు వలసిర యేనిన్.

129


వ.

అనిన విని మిథిలేశ్వరుండు కుంభకు రావించి నీసప్తవృషభంబులు భూమియం
తయుం బాడుగా మేసెఁ బ్రజలు నిలువలే మని మొఱపెట్టెదరు నీవు దొరవు
గాని తుచ్ఛుండవు గా వట్లగుట దీనికి ని న్నొం డననేరము వానిం బట్టి కట్టింపు
మొండె నెద్దుపట్టింపు కాకున్న నరణ్యంబులు సొర వెలిపింపుము లావరు లగు
చుట్టలు గలవాఁడవు నీకు సాధ్యంబు గానిది లే దివ్విధం బనాలస్యంబునఁ గైకొన
కున్నఁ దప్పక యొప్పమి వచ్చుం జుమ్ము పొమ్మనిన నట్ల కాక యని యతండు బల
వంతులఁ బెక్కండ్ర నక్కార్యంబునకు నియోగించుటయు.

130


తే.

[5]పల్లియలు వైచి యోదముల్ పెల్లు ద్రవ్వి, తార్చి వేసఱియురులొగ్గి తఱిసిడయ్యఁ
దోలి యోటరి పోనీక దొడ్డి నాఁగి, పొడువ నొడువను నలుదెసఁ బొంచి యోడి.

131
  1. నిడుకొకడిమి
  2. జొచ్చిన పాటనములు గంప
  3. అగళులు (పూ. ము.)
  4. యిడుమఁ
  5. తల్లియలు వైచి విసివి యోదములు ద్రవ్వి, త్రవ్వి వేపఱి యురులొగ్గి తగిలి వలియఁదోలి...నలసతఁబొంది యోడి (పూ. ము.)