పుట:హరివంశము.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 6

149


రంబులు గైకొని రప్పుడు పుత్రుని విచిత్రవిక్రమోత్సవంబునకు నానందించి
నందుం డాయత్తంబు సేయించిన చతుర్విధాన్నంబులు గొని గోపకుటుంబినులును
దారకదారికాసహితంబుగాఁ జనుదెంచినం దత్ప్రయత్నంబున.

102


తే.

సముచితప్రదేశంబున జలజనాభుఁ, డగ్రజుం డగ్రపాత్రంబునందు నిలువ
దాను బెద్దలుఁ జెలికాండ్రుఁ దగఁగ నార, గించి తాంబూలములు గొని మించియెలమి.

103


వ.

కొండొకసేపు విశ్రమంబు నొంది తదనంతరంబ సముత్థితుం డై కదలి లోకక్షే
మకరంబు లగుశకునంబులు గనుంగొనుచుఁ దద్జ్ఞు లవ్విధం బభినందింపఁ జను
దెంచె నప్పు డొండొరులం గౌఁగిలించుచుఁ బరువులు వెట్టుచుఁ దారుచు నెలుం
గెత్తి నవ్వుచుం బాడుచు వేణువీణాధ్వనిమిశ్రంబుగాఁ బటుపటహధ్వనివాద్య
వాదనంబు లొనర్చుచు గోపాలు రాలోకసీమంబు లగుసమ్మోదసంభ్రమంబుల
నొప్పి యప్పురుషోత్తముముందరం బిఱుందనుం బార్శ్వంబులను దత్పౌరు
షంబు ప్రశంసించుచు [1]బెరసి రిట్లు వచ్చి యందలు సాయాహ్నసమయంబున
వ్రేపల్లె సొచ్చి తమయిచ్చ నుండిరి విప్రవరులు గోపవృద్ధులవలన సమర్చనంబు
నొంది నిజస్థానంబులకుం జనిరి వాసుదేవుండు జననీజనకవాత్సల్యంబునఁ బర
మోత్సవంబు గని వత్ససంచరణతత్పరం బగుతనపూర్వక్రీడనంబున విలసిల్లు
చుండె నంత.

104


మ.

విషవృక్షంబు జయించి తాపభరమున్ వే పాపి వ్రేపల్లెక
ల్మషము ల్మాన్చినకృష్ణుతోఁ దనకు సామ్యం బాసపడ్డట్లు దు
ద్విషహగ్రీష్మ మడంచి విశ్వము నిరుద్వేగంబు గావించుచున్
సుషమం బయ్యె నభస్యమాసము పరిస్ఫూర్జద్ఘనశ్యామ మై.

105


ఉ.

చాతకవందిబృందములు సంస్తుతి సేయ విశాలబర్హి బ
ర్హాతపహరణంబు లెలరారఁగఁ బర్వతభద్రపీఠముల్
ప్రీతి నుపాశ్రయించి జలభృద్ధరణీవిభు లాక్రమించి రు
ద్యోతిసురేంద్రచాపనవతోరణశోభతభూమిభాగమున్.

106


క.

రాయంచలగుండె[2]బెదరు, మాయామంత్రము వియుక్తమానచ్యుతి క
త్యాయతమయూరకర్ణర, సాయన మనఁ బ్రథమజలధరారవ మెసఁగెన్.

107


క.

దినపతియు నిశావిభుఁడును, దనతననామము నిరర్థతం బొందిన సి
గ్గునఁ బొడసూపరొ [3]యనఁగా, దిననిశ లోక్కటిగ మేఘతిమిరమ యయ్యెన్.

108


క.

లలితగగనరంగంబున, నలయక కొమ్మఱుఁగు [4]గొండ్లియై యాడెడుచో
నలవడియె మొగులుదెరలును, బొలుపగు వడగండ్లగములపుష్పాంజలులున్.

109


క.

జలధారలు మదధారలు, జలధరములు [5]మొగవడములు [6]చండానిలవి
హ్వలగహ్వరరవములు గ, ర్జలుగా గిరు లమరె సమదసామజసమతన్.

110
  1. మెరసి
  2. చెదరు
  3. నాఁగా
  4. వెలఁదియై
  5. పావడములు. (పూ. ము.)
  6. సరగునరాయం, చలవిహ్వల