పుట:హరివంశము.pdf/196

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

హరివంశము


చ.

గొనకొని పేర్చి నాలుకలు గ్రోయుచు ఘర్మవిశేషతీవ్రతం
బొనరుసమీరసఖ్యమును భూరితరంబుగ సంభవించుటన్
గనలుచుఁ బావకుం డడరి కాల్చె ముహూర్తములోన నమ్మహా
దసుజకళేబరద్రుమవితానములన్ వెస నుగ్గునూచగన్.

93


వ.

అంత.

94


క.

కురిసె సురపుష్పవర్షము, హరిపై నప్సరస లాడి రాతోద్యంబుల్
మొరసే సుఖస్పర్శంబై, బెరసెం బవనంబు దెసలు [1]వెలసెం గలయన్.

95


వ.

ఇట్లు విజయోల్లాసభాసి యైనవాసుదేవు నవ్వసుమతీదేవులును వల్లవప్రముఖు
లునుం బ్రభూతభాషలం గీర్తించిరి. రోగార్తిముక్తం బై తత్క్షణంబ బృందావనం
బును భువనపావనం బగుభావనంబునం బరఁగుటకు నర్హం బయ్యె నాసమయంబున.

96

శ్రీకృష్ణుడు గోపాలురతో యమునయందు జలక్రీడ సలుపుట

మ.

చెమటం దొప్పఁగఁదోఁగి భస్తకణికాస్ఫీతోత్తమాంగంబులన్
సుమహానిశ్వసితాకులాననములన్ శోభిల్లు మేలు ల్మహా
శ్రమవేగంబునఁ దూఁగ నందఱు విహారాపేక్షు లై డిగ్గి ర
య్యమునాభూమికి [2]వెండివెల్లిసుకపెల్లై యున్నమార్గంబునన్.

97


తే.

పౌరుషము మెచ్చి ముదము నిండార నగుచుఁ, గౌఁగిలింపంగ నేతెంచుకరణి నొప్పెఁ
బ్రకటఫేనయై కడలచే బారసాఁచి, హరికి నభిముఖంబుగఁ బొంగుతరణికన్య.

98


మ.

గురుగోత్రాధరవప్రభూములు వడిం గోడాడి [3]యందంద చం
డరసోర్దర్ప మెలర్ప యూధముల వెంటం గొంచుఁ గ్రీడార్థి యై
యరుదార న్మదభేదభారమున నొయ్యం జొచ్చువన్యద్విపేం
ద్రురుచిం బొల్చె జలౌఘమున్ దఱియు నాదోశ్శాలి గోపాళితోన్.

99


వ.

ఇట్లు సొచ్చి యమ్మహావాహినియందు.

100


సీ.

ఒండొండ యిద్దరినుండి యద్దరిదాఁక నేపారుపురుడున నీఁది యీఁది
మునిఁగి లోలోనన చని దవ్వుదవ్వుల ననువున నెగసి పెల్లార్చి యార్చి
కడగానరానిపెన్మడువుల[4]ఁ బఱతెంచి యుఱికి వే కడుఁ దేలి మెఱసి మెఱసి
యొండొరుఁ బేర్కొని యోలయోలని రేఁచి యదటున జల్లుపోరాడియాడి


ఆ.

వాద్యభంగి జలము వాయించి వాయించి, పాడిపాడి కెరలి యాడియాడి
తనిసి మూఁడుజాలతఱి ప్రొద్దొకించుక, చల్లపడిన నల్లనల్ల వెడలి.

101


వ.

గోపాలురు కృష్ణపాలనంబు గనినవారు గావున భావంబు లలరఁ బరిధానాదుల
నలంకృతు లై మనోజ్ఞవేషంబులతో నిలిచి రయ్యదుకుమారు లిద్దఱు నటమున్న
తల్లులు పుత్తేరఁ బరిచారకులచేత నుపనీతంబు లైనధౌతాంబరప్రముఖపరిష్కా

  1. వెలుఁగెన్
  2. వేడిపెన్నిసుక (పూ. ము.)
  3. యుద్దండ
  4. నడుగుకు నుఱికి వేకడ వచ్చి