పుట:హరివంశము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 6

139


భూవలయైకగణ్యు నతిపుణ్యుఁ దనూభవు నెట్లు గాతు నం
చీవు దలంచి యున్కి మది నేఁ గని వచ్చితి నిన్నుఁ [1]దేర్పఁగన్.

15


మ.

విను నారాయణుఁ డాదిదేవుఁడు జగద్విఖ్యాతసత్వుండి మే
దినికిన్ భారము డింప దైత్యుల [2]విఘాతంపంగఁ గ్రీడార్థమై
జనియించెన్ భవదీయసూనుఁ డనఁగా సంఛన్నుఁడై కాన మ
ర్త్యునిఁగాఁ జూడకు కృష్ణు రాముఁడును దత్తుల్యుండ యత్యున్నతిన్.

16


వ.

వీ రిద్దఱు నుద్దామం బగు ధామంబున నపరిభావ్యు లగుభవ్యులు పూతన యను
యాతుధాని యామినీసమయంబున విషదిగ్ధనిజస్తనదుగ్ధంబులు గ్రోల్చి కూల్చెద
నని వచ్చి యచ్చిఱుతవానిచేత నిపాతిత యయ్యె శకటరూపధారి యగు
దారుణదైత్యుం డత్యుగ్రకర్మంబు సేయం దలంచి తలంపులోనన వికలుం డై
కెడసె నిద్ద ఱసురలు మద్దు లై యిమ్ముద్దులపాపనిఁ బాపం డని కొలంది యెఱుం
గక పయింబడి నలుపుద మని పూని యున్మూలనంబు నొంది రింక నిమ్మహా
తేజుం డనేకదనుజధ్వంసంబు సేయంగలవా డిది దేవరహస్యంబు నీమీఁడిపక్షం
బునఁ బ్రత్యక్షంబుగాఁ దెలిపితిఁ గలంక నొందక బృందావనంబునకుం జనుము
శోభనం బయ్యెడు నని చెప్పి బ్రహ్మసూనుండు దామోదరునొద్ద కరిగి సవినయ
సందర్శనం బొనరించి.

17


శా.

త్రైలోక్యంబు సృజింపఁ బెంప నడఁపన్ దక్షుండ వై యింతకున్
మూలం బై యిట నందసూసుఁ డనఁగా ముగ్ధాకృతిన్ లీలమై
బాలత్వంబు నటించునిన్ను మదిలో భావింతు రుద్యన్మతుల్
హేలానిర్దళితారి సర్వమును నీయిచ్ఛావశం బచ్యుతా.

18


క.

బృందావనకేళికి నై, బృందారకవరద చాలఁ బ్రియపడియెడు నీ
డెందము తడ వింకేటికి, మంద గదల్చికొని చను మమందప్రీతిన్.

19


క.

అని మునివరుఁ డాతని వీ, డ్కొని చనియెఁ దగంగ నందగోపుఁడు గోగో
పనికాయమునకు బృందా, వనగమననిశ్చితైకవాక్యతఁ జెప్పెన్.

20


వ.

ఇట్లు నారదోపదేశంబున నిర్విశంకమానసుం డగువల్లవముఖ్యుపనుపున సర్వజనం
బులుం బయనంబు సమకట్టుటయును వ్రేపల్లె నెల్లకడల.

21


సీ.

[3]బండ్లమెట్టింపుపై బరువు లెక్కింపుమీ దళ్లనుబూన్పు కావళ్లనునుపు
పదిలంబుగా నేతిపనఁటులు క్రొత్తగోనియలబియ్యము వడ్లు నెమిలివడ్లు
నొదివిరి ప్రాలును నొనరంగఁ బోసి చాపలు మంచములు మీఁద బలియఁ గట్టు
దామెనలును వల్లెత్రాళ్లును దలుగులు [4]గవ్వము ల్గొడవలి కత్తిసూఁడుఁ


తే.

గొడుపు[5]వాదోళ్లు మొదలుగాఁ జెడకయుండ వలయుముట్లెట్ల దెమ్ముకంటలపుటెడ్ల
నాయితముసేయుముదుసళ్ల నాఁడువారి, గంపమోపులు ముందరఁ గదలుమనుము.

22
  1. దీర్పఁగన్
  2. బాధింపంగ
  3. బండులు గట్టిపై
  4. గస్పాలుగొడ్డలి
  5. వొడ. త్రోదోళ్లు