పుట:హరివంశము.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

హరివంశము


వ.

అని యివ్విధంబున నందఱుఁ గూడి యొక్కట నచ్చేడియమీఁద నధిక్షేపించి.

230


క.

ఎక్కడి కేనియుఁ బోయెద, మిక్కష్టపుఁబాటు పడఁగ నే మోర్వము నీ
చొక్క పుఁగొడుకును నీవును, [1]నొక్కతలయు నొక్కమూరి నుండుఁడు నెమ్మిన్.

231


వ.

అనిన విని యశోదాదేవి వేర్వేఱ వారి [2]ననునయించి.

232


క.

మీ సేగు లెల్ల నచ్చెద, వేసరకుఁడు మీరు లేక వేగునె మాకున్
జేసెం జేయఁడు బాలకుఁ, డాసురపుంబనులు నిజము లనియెదరు బలే.

233


క.

బొంకాడెడుగఱితలె మీ, రింకిటఁ [3]జూచుకొనుఁ డితని నె [4]ట్లడిచెదనో
[5]కింకయును గలఁకయును మది, శంకయుఁ బోవిడిచి చనుఁడు సదనంబులకున్.

234


వ.

అనిన నట్ల కాక యని గోపికలు నిజస్థానంబులకుం జనిరి తదనంతరంబ.

235


మ.

భువనక్లేశము లెల్ల మాన్ప శిశుతాస్ఫూర్తిం బ్రవర్తిల్లుచున్
వివి క్రీడలఁ బ్రౌఢ యైన ప్రభువున్ విష్ణుం బ్రవర్ధిష్ణు [6]నా
నవనీతామృతచోరుఁ జూచి యెలమిన్ రాజాస్య యాత్మీయసం
భవతాబుద్ధిఁ బ్రవృద్ధమైన మమతాబంధంబు సంధిల్లఁగన్.

236


శా.

ఏలా యిందును నందుఁ [7]బాఱెదవు నీకే బ్రాఁతియే వెన్నలుం
బాలుం బాలక [8]చాలఁ జేఁపె నిదె నాపా[9]లిండ్లు పెన్ సోనలై
పా లొక్కుమ్మడి గ్రమ్ముచున్నయవి నీభావంబునం దృప్తిగా
గ్రోలం జాలవె యింతవ ట్టకట యోగోనేల చుట్టాలలోన్.

237


తే.

తల్లి చనుఁబాలు గ్రుక్కెడు తక్కి[10]నయవి, పుట్టెడును నొక్కరూపనభూమిఁబరఁగు
నొడువు బొంకయ్యెఁ జన్నిత్తు దొడలమీఁద, గుండె వట్టి యించుకచడ వుండవన్న.

238


క.

అని యెత్తుకొని యురంబునఁ, దనియఁగ నదిమికొని చన్ను తన్ముఖమునకున్
ఘనదుగ్ధపిచ్ఛిలంబుగ, మనమలరఁగ నిచ్చుటయుఁ గుమారుఁడు ప్రీతిన్.

239


చ.

మును జననీస్తనంబులకు మోపఁగ వ్రేగయి యున్నయట్టి య
వ్వినుతపయస్సు లన్నియును వేడుకతోఁ గడుపార నారగిం
చిన బ్రియ మంది నందసతి చెక్కులు నక్కును మ స్తకంబు మూ
ర్కొనుచును ముద్దులాడి మఱి కొండొకసేపునకుం బ్రియంబునన్.

240


వ.

అయ్యర్భకు నుద్దేశించి.

241


క.

వఱువాత లేచి నీదగు, కొఱగాములు చక్కద్రోచికొనఁబోయి దినం
బిఱులుపడి యున్నయవి పను, లఱజాతివి నిన్ను నేమి యన నేర్తు సుతా.

242


క.

విడిచిన నెప్పటికి చని యా, గడములు సేసెదవు నిన్నుఁ గాచుట మాకుం
గడువ్రేఁగు దుర్జనుని నిలఁ, దడయక [11]యెఱుకమెయిఁ ద్రోపు తగుమందెందున్.

243
  1. ఒక్కత లై స్రుక్కుమాని, ఒక్కతలయు నొక్కయూర
  2. నందఱ ననునయించి
  3. జూచి
  4. ట్లడఁచె
  5. కింకయుఁ గలఁకయు మదిలోన్
  6. నిన్
  7. బాఱెదవు నీకున్
  8. పాలు చేఁపెనిదె
  9. లిండులన్
  10. నవియుఁ బుట్టెడు
  11. యనాకత్రోవఁఁ దగ మర్దింతున్