పుట:హరివంశము.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5

133


ఉ.

ఓవరిలోన గొంది దెస నున్నవి యెన్నియొ యెన్నఁ బెద్దభాం
డావళి దాళముం దలుపు [1]నావలఁబోఁ బడమీటి చొచ్చె మా
యావి భవత్సుతుండు వెస నంతన యేనును బాఱుదెంచితిం
ద్రావెనొ యేమి సేసెనొ ఘృతం బొకబొట్టును లేదు లోపలన్.

219


క.

ఏపొలములుఁ బాడయ్యెనె, యీపల్లెకుఁ జిచ్చు వెట్టి యేఁగెద మేమున్
మాపసులును గలిగిన నట, నేపగిదిని బ్రదుకరాదె యిటు చెడుకంటెన్.

220


సీ.

అనుచుండ మఱియొక్క యతివ యాగ్రహమున నంచఱఁ ద్రోచికొం చరుగుదెంచి
యేమని వినియెద విన్నియు నాయింటి సేగి సెప్పఁగఁ జెట్ట లాగడీఁడు
నీకొడు కేతెంచి నేఁడు నెలఁత యెన్నఁ బదిపంట్లనేయును బాలుఁ బెరుగు
నొండొంటిఁ గలయంగ నుర్విపై వఱదలుగాఁ జల్లి పనఁటులు [2]కాలఁ గేలఁ


తే.

దన్నియును వ్రేసియును వెసఁ బిన్న పెంచి, కలుగఁజేసి పాయసము గూరలును గూడు
పడుచులకుఁ బెట్టి దొంతులు పగుల నడిచి, నడరి పెయ్యల నన్నింటి గుడువవిడిచె.

221


తే.

పూసద్రాడు దుయ్యను లేదు [3]పొలఁతి మెడకుఁ, బెరువు [4]పాలింట నేడ్చినబిడ్డకైన
మిడుపలే దెల్ల దాననుఁ జెపితీ మొల్లఁ, బోయితిమి [5]ప్రాయిగలపట్టి పొట్టఁబెట్టి.

222


వ.

అనియె నట్టియెడ నోరు పెలుచని యెలుంగున.

223


చ.

కలయఁగఁ బాలు[6]పిండి పులకండము వెన్నయుఁ బెట్టి యట్టులై
యలవడ వండితిం బతియు నాత్మజులుం బ్రియపడ్డ నాలుగే
నలకులదొంతి డించి యవి యన్నియు నుగ్మలి నీతనూజుఁ డొ
ప్పులువడ మ్రింగెఁ జోద్య మిది బూతము లున్నవిగాక కడ్పునన్.

224


క.

మగ[7]డింక నన్ను సైఁచునె, దిగవిడుచుం జంపుఁ గాక తెల్లము మది న
మ్మిగ పుట్టునె యిది చెప్పిన, మొగమోటన మనుపుచుండి మూసితి నబలా.

225


తే.

అనఁగ వేఱొక్కగొల్లత యమ్మ వినును, బానలోపల [8]యవపిండి పంచదార
యొదవఁగలపి మూలను డాఁచియుండ వచ్చి, తినియె నంతయుఁ గృష్ణుండు దేవరాన.

226


క.

అంతటఁ బోవఁడు గూనెడు, సంతసమున బాపికొనియెఁ జయ్యనం గలకూ
డంతయును విష్ణుమాయ [9]ప, డంతీ! యివి శిశువునం దడంగెడుపనులే.

227


ఉ.

నావుఁడు నోరు నెమ్మొగమునం గడుదైన్యము దోఁప వచ్చి నా
యావులఁ గ్రేవులం గలపి యార్చి వెలార్చినఁ బోయి ఘోరదు
ర్గావలి సొచ్చె నింట మగఁ డాత్మజు లెవ్వరు లేరు ప్రల్లదుం
డీవిధి మమ్ము మన్నిగొనియెన్ భవదీయసుతుండు గోపికా.

228


ఆ.

[10]పుట్టియంత వెన్న ప్రోవుగఁ బేర్చిడి, గడిగి కడిగి యొక్కగనప చేర
నంతవట్టు మ్రింగె నట సూచి చూడంగ, నొంటి నిట్టిమనుజు లుర్విఁ గలరె.

229
  1. నాతలఁ బోనటు
  2. గాల
  3. పొమ్ము
  4. పొరుగింటికించిన
  5. ప్రాలుగల కట్టి పుట్టఁబట్టి
  6. బిడ్డి
  7. డువిని యింక
  8. ఁబిండియుఁ బంచ
  9. ప, నింతీ యివి శిశువునం దడం గెడుపనులే
  10. ఠీవి పుట్ట వెన్న ప్రోవుగఁ బెట్టితి, కడఁగిఁడఁగి యొక్కకడవ వాడయంతపట్టు