పుట:హరివంశము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5.

127


వ.

అనియె నంత నఖిలగోపాలకులు నయ్యపాయంబు దప్పిన యొప్పిదంబు వేనవేలు
భంగులం గొనియాడి యాడాకినీకళేబరంబు దొలంగం దిగిచిరి నందుం డానంద
వికసితాననుం డై సూనుం దా నెత్తికొని గోకరీషమిశ్రితం బగుభూరజంబు
పరఁగం గావి రక్షాతిలకంబుఁ బెట్టి.

160


సీ.

శ్రీనాయకుండు రక్షించు నీముందర వేధ రక్షించు నీ[1]వెనుకదిక్కు
వరుస నీదక్షిణవామభాగంబులు రక్షింతు రవ్విరూపాక్షుగుహులు
నీమీఁదుదిగువయు [2]నీరజాహితుఁడు వాసుకియు రక్షింతురు [3]ప్రకటకరుణ
దిక్కులు గాడ్పు నీతక్కినచోటులు రక్షింతు రెప్పుడు నక్షతముగ


తే.

స్వస్తి గావించు నీకు వృషధ్వజుం డ, నాకులైశ్వర్యశాలి పినాకపాణి
నిత్యశివ[4]లగుగోవులు నీయతపుణ్య, యైనభూమియు నిను నెల్లయందుఁ బ్రోచు.

161


వ.

అని యిట్లు బాలరక్షణార్థంబు పూర్వమునికల్పితంబు లగుమంత్రంబులు జపి
యించి ప్రయత్నంబునఁ గుమారు నరసికొనియుండ నమ్మహాసత్త్వుండును
మహత్త్వదీప్తుం డై వర్ధిల్లుచున్నంత.

162


సీ.

వసుదేవుపనుపున వసుమతీ దేవుండు గురువృత్తియుతుఁడు గర్గుండు నాఁగఁ
జనుదెంచి రోహిణీతనయునకును యశోదాతనూభవునకుఁ దగఁ గ్రమమున
జాతకర్మోత్తమసంస్కార మనురూపవిధ్యుపేతముగఁ గావించి వారి
కభిధానములు రాముఁ డనియుఁ గృష్ణుం డనియును మహనీయగుణోచితంబు


తే.

లై ప్రసిద్ధత నొందెడునట్లుగా నొ, నర్చి తనరాకపోకలు నరుల కొరుల
కెఱుఁగరాకుండునట్లుగా నేఁగె నవ్వి, ధంబునకు నందగోపుఁ డెంతయును బొంగి.

163


క.

భూసురులం బిలిపించి మ, హాసరసము లైనయంచితాన్నములు సము
ల్లాసమున నొసంగి గోవులు, వాసస్సులు నిచ్చి యుత్సవము సేసి తగన్.

164


వ.

గోకులంబునం గల చుట్టంబుల కెల్లం గట్టనిచ్చి గోవులఁ బూజించి గోవాటం
బలంకరించె నిట్టికల్యాణంబున సంతసిల్లి.

165


ఆ. గొడ్డువీఁగి కనియెఁ గొడుకు నెంతయు మూర్తి, మంతు నెలఁతలందు మహితభాగ్య
యొక్కతియ యశోద యుర్వి[5]పై ననుచు వ్రే, పల్లెఁ బొగడి రెల్లపడఁతుకలును.

166


శా.

సిద్ధంబై తనరారుమూర్తిగరిమన్ శ్రీమంతుఁడై దీప్తిచే
నిద్ధార్కప్రతిమానుఁ డైనతనయుం డిట్లబ్బె [6]వీఁడెంతయున్
వృద్ధశ్రీయభివృద్ధిఁ బొందె ననుచు వేవేలచందంబులన్
సిద్ధాత్ముం డగునందగోపు వినుతించెన్ గోపకవ్రాతముల్.

167


వ.

అక్కడం గంసుండు పూతనవోయినపోక నిజాప్తులగు దనుజుల చేత విని నంద
గోపతనయు[7]దెస శంకించి మున్ను కౌశికాదేవిచేతి పరిభూతివలన మొక్క

  1. వెనక
  2. నీరజ
  3. ఁబ్రకట
  4. సిద్ధులౌ
  5. యందనుచు
  6. నీ కెంత
  7. వలన ధిక్కరించి