పుట:హరివంశము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

హరివంశము


తే.

జనని [1]పొదిగిట నున్నబాలునిఁ గడంక, నెత్తికొని ఱొమ్ముపై నిడి యొత్తి [2]విషపుఁ
జన్ను మొనలు తదాననాబ్జమున నదిమె, నదుముటయుఁ బాపఁ డార్తుఁడై నట్లపోలె.

150

శ్రీకృష్ణుఁడు పూతనప్రాణంబులు స్తనదుగ్ధంబులతోడం గొని చంపుట

ఉ.

ఎత్తిలి కావు కావు రన నేడ్చి తదీయపయోధరాగ్రముల్
కుత్తుకదాఁకఁ బెట్టికొని క్రోలెఁ గ్రమంబునఁ జన్నుఁబాలతో
నెత్తురు మున్నుగాఁగ గణనీయము లై చనుసప్తధాతువుల్
పొత్తుగఁ బ్రాణము ల్చెనఁటిబొందియ త్రిక్కఁగ నొక్క వ్రేల్మిడిన్.

151


క.

రక్కసికిని దా నెక్కుడు, రక్కసియై కృష్ణుఁ డిట్లు క్రౌర్యావేశం
బక్కజముగఁ బచరింపఁగ, నక్కుటిలాసురియు గెడసె హాయనుచు భువిన్.

152


తే.

అధికవిస్వరం బైనయయ్యార్తనాద, మునకు మందలోపలఁ గలజనము లెల్ల
మేలుకొని రటమున్న యబ్బాలు నేడ్పు, విని యశోదయు మేల్కని విహ్వలించి.

153


వ.

తన ముందట మును ప్రసుప్తుం డైననందనుం గానక నందగోపునిం బిలిచిన
నతండు నాలోనన యుదరిపడి తెలిసి పఱతెంచి ని ట్లెల్లవారు[3]నుం జనుదెంచి శక
టాంగమాత్రంబు లగు నేత్రంబుల గ్రుడ్లు దిరుగంబడి వికృతంబు లై మెఱవ నతి
మాత్రదీర్ఘంబు లగుపాణిపాదంబులు విరియం బడి యొడలు పగిలి యెమ్ములు
నలిసి చర్మంబు ప్రోవై యున్నయన్నిశాచరిచందంబునకు నాశ్చర్యంబును భయం
బునుం బొంది తదుత్సంగంబునఁ బతంగుభంగి నెసంగు కృష్ణునిం గాంచి రప్పుడు.

154


తే.

ఆకట నేఁ జెల్ల నేఁ జెల్ల హాకుమార, హాతనూభవ హావత్స యనుచు నార్తిఁ
దల్లియును దండ్రియును వచ్చి తనుజుఁ బొదివి, రమ్మృగేక్షణ బాష్పాకులాక్షి యగుచు.

155


వ.

బాలుని గ్రుచ్చియెత్తి యురంబున నదిమికొనిన నందుండు నయ్యిందువదన నిది
యేమి యీరక్కసి యెక్కడ నుండి వచ్చె నిచ్చిఱుతవాని నీచందంబు సేయుట
యెల్ల నీ వేల యేమఱి తనిన నయ్యబల యతనితోడ.

156


తే.

కడుపునిండఁగఁ జన్నిచ్చి కొడుకు నిద్ర, వోవ దీవియ మండంగఁ బ్రొద్దువోవు
నంతదాక మేల్కనియుండి యలసి కన్నొ, కింత మూసితి నాలస్య మేది యిందు.

157


క.

ఈపాపజాతి రక్కెస, యేపగిదిఁ గడంగి యిచటి కేతెంచెనొ యీ
పాపం డెమ్మెయి నెట్ల యి, [4]ప్రో ఱియె నిదేమిమాయ పుట్టెనొ యెఱుఁగన్.

158


ఉ.

కానక కన్నపట్టి యిటు కట్టిఁడి రక్కెస[5]వాతఁ జిక్కియుం
న్దానొకకీడు నొందక ముదంబున నా కిదె చేరె నిక్కువం
బేనలినాక్షికిం గలదె యిట్టితపంబున పేర్మి చంద్రబిం
బాననుఁ డింక వీఁడు పరమాయురుపేతుఁడ యెల్లభంగులన్.

159
  1. పొదివిట
  2. పిదప
  3. నేతెంచి చూచి
  4. పోపడియెనొ యేమి
  5. చేత