పుట:హరివంశము.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5.

125


గంఠసూత్రవలనంబుల బాహులతాందోళనంబులం బయోధరసంఘర్షణంబుల
శ్రోణిసన్నహనంబుల మృదుగీతమాధుర్యంబుల మనోహరంబు లగుదధిమథన
వ్యాపారంబులం (జాలఁ) బారీణ లగుబాలికలును ఘృతతక్రవిక్రయంబు గృహ
సమ్మార్జనంబు శిశుసమాశ్వాసనంబు బాలకభృతకభుక్తిప్రదానంబు మొదలయిన
పనులం జిడిముడి [1]పాటు వెలయ మెలంగు గరిష్ఠకుటుంబినులును నైనగోపికల
యుదాత్తచేష్టితంబులవలనను సర్వప్రకారసుభగం బయి నవతృణచ్ఛన్నకుటీ
కవాటంబును ననర్గళాలక్షితవాస్తుసీమంబును విశంకటశకటనికటార్పిత మంచ
కంబును నాజ్యపచనసుగంధియును [2]దప్యమానదగ్ధచూత్కారముఖరంబును
నర్భకకబళవిగళితమస్తుసిక్తకరీషస్థలంబును దధిబిందుసుందరవేదికంబును నైన
యమ్మహాఘోషంబు బ్రవేశించి.

143


తే.

వృద్ధు లగుగోపముఖ్యులు వేడ్కఁ దన్ను, నెదరుకొని యభినందింప నింపు మిగులఁ
దాను నందఱ నధికహృద్యముగఁ బలికి, యాదరించుచు వారుఁ దో నరుగుదేర.

144


వ.

నిజసదనంబునకుం జని వృద్ధగోపికలు పుత్రసమన్విత యగుయశోదకు నొనర్చు నవ
సూతికామంగళం బంతరంగంబు హర్షోత్తరంగంబు గావింప బాలార్కసన్నిభుం
డగుకుమారు రోహిణి యెదుర్కొనిన నద్దేవికి సభక్తికంబుగా సంభావనంబు
గావించి భావం బలరం బూర్వప్ర కారంబున నుండె నిట్లు కృష్ణుండు గోకులంబున
గోపికాపర్వం బై యత్యద్భుతం బగు ప్రభావం బపరిభావ్యంబుగా నుండునంతం
గొన్నిదినంబు లరిగిన.

145


క.

మును కంసునిపనుపున గ, ర్భనిపాతము శిశువధంబ పనిగా నెచ్చో
టను దిరుగు ననుజనివహం, బున కగ్రణి దురితచరిత పూతన యనఁగన్.

146


వ.

ఘోరాకార యగునిశాచరి నిశాసమయంబున నర్భకుల వెదకుచుం జనుదెంచి
నందగోపశకటంబుక్రిందం దగుతల్పంబున నుత్తానశాయి యై యున్నవెన్నుని
యంతికంబున నంతంత నిలిచి.

147


క.

ఆమూర్తి యట్టి తేజం, బామహిమ నిజాంతరంగ మద్భుతభీతి
వ్యామోహితంబు సేయం, గా మెత్తనఁ గొంత సేపు కనుఁగొని యలుకన్.

148


క.

వీఁ డెల్లపోటిబాలుఁడు, గా డాకంసునకుఁ గీడు గావించుటకై
పోడిమి యెసఁగ జనించిన, వాఁడ యగును వీనిఁ దునిమివైచెద నంచున్.

149


సీ.

పండ్లులు గొఱుకుచుఁ బదరి హుమ్మని [3]మిడిగ్రుడ్లుల నిప్పులు గుమ్మరిలఁగ
నదరెడుకటములు నాకుంచితము లగుబొమలును నుదుటిపైఁ బొడముచెమట
[4]మెఱుఁగుకోఱలుఁ బేర్చి యెఱమంట లందందఁ జల్లెడుబహుళనిశ్వాసములును
నాగ్రహంబునఁ [5]బొరి నాకంపితము లగుకరములునై భయంకరము గాఁగ

  1. పడిపొలయ
  2. మధ్యమానోద్గశధూత్కారముఖరంబునురు, దహ్యమాన
  3. చూచి మిడిగ్రుడ్లు నిప్పు లొక్కెడఁ జెదరఁగ
  4. మెఱచు
  5. జొచ్చియా