పుట:హరివంశము.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5.

123


తే.

 కాన నింతయుఁ దలపోసి మాను మింక, నఖిలదుఃఖచింతామయం బైనకలఁక
యేను గాలుగేలును బట్టి [1]యిదె వినీతి, వేఁడికొనియెదఁ బరమపవిత్రచరిత.

135


వ.

అనిన నద్దేవి యశ్రుపూర్ణనయన యై తండ్రి యిట్టిశోకంబు [2]నా కనుభవింపను
మద్గర్భంబులకు [3]నిట్టిపోకలం బోవను మున్న కడకట్టినతెఱంగు నీ వేమి సేయు
దని యుచితంబుగాఁ బలికెఁ గంసుండును నిజగృహంబున [4]కరిగె నంత నాప్రొద్ద
వసుదేవుండు.

136


క.

ముద మెసఁగ నందగోపుని, సదనంబున కేఁగి పుత్రజననంబున స
మ్మదభరితుఁ డైనయతనిని, హృదయప్రియసుహృదుఁ గాంచి యిట్లనియెఁ దగన్.

137


మ.

సుతు [5]నత్యద్భుతలక్షణాన్వితునిఁ దేజోభాసితుం గంటి వీ
వతిధన్యుండవు భామినీసహిత మీయాత్మోద్భవుం గొంచు ధీ
యుత మీచోటగుగోకులంబునకుఁ [6]బొ మ్మున్నాఁడు వ్రేపల్లె నా
సుతుఁ డారోహిణి గన్నవాఁడును భవత్సూనుండ కాఁ జూడుమీ.

138


ఆ.

వాఁడు పెద్దవాఁడు వీఁడు రెండవపట్టి, యనుతలంపుతోడ ననఘ నీవ
పెనుపు మడవిలోనఁ బెక్కపాయంబులు, గలుగు నేమఱమియు వలయుఁజుమ్ము.

139


ఉ.

పుట్టఁగఁ బుట్టఁగాఁ దునిమెఁ బుత్రుల దేవకి గన్నయందఱం
గట్టిఁడి పాపజాతి యగుకంసుఁడు తద్విధి చిత్తమున్ వగం
బెట్టెడు రోహిణీకలితపిండ మొకండును దప్పె వీని నీ
వెట్టయినన్ మహాత్మ భరియింపుము దీవనఁ బొందు మెంతయున్.

140


వ.

ఇంక శిశుఘాతిని యగుపూతనకుఁ గంసుపసుపున శిశుహింసాన్వేషణంబ పనియై
యుండు నీ వీప్రొద్ద యిచ్చోటు వాసి చని వేగకమున్న మంద సొరవలయుం గులా
యలీనంబులగుపక్షులు వేగుటెలుంగులు సూపెడుఁ బ్రాగ్దిశాభాగంబునఁ (బ్రారబ్ధ)
ప్రభాకరధ్వజవికాసం బగుచుఁ జనుదెంచె నీకు నిప్పురంబునం గరప్రదానం బొన
రింప వచ్చినపనియును సంపన్నం బయ్యెఁ దడయవలవ దనిన నట్లకాక యని యగ్లో
పముఖ్యుండు.

141


తే.

పురిటిపాపనిఁ దొట్లెలోఁ బొందుగాగఁ, బెట్టి మోపించుకొని తాను బ్రియసతియును
మేటిగుజ్జులఁ గట్టినపాట[7]బండి, యెక్కి శీఘ్రంబ మందకు నేగె నెలమి.

142

నందుఁడు మధురాపురంబుననుండి వసుదేవు నాజ్ఞచే వ్రేపల్లెకు వచ్చుట

వ.

ఇట్లు చని పుష్పితఫలితానేకతరుషండమండితం బగుకాళిందీతటంబున నలుదెసలం
బొడవుగా నమర్చిన బలితంపుములువెలుగులం గరంబుజతనంబులై యొప్పు [8]పెను
దొడ్లం గ్రమంబునం బ్రమోదంబున వేఁకువం బోఁకు మేసి వచ్చి రోమంథవదనం

  1. యిదియ వినతి
  2. తనకు న
  3. నిన్నిపోకులం
  4. కుంజనియె నంతప్రొద్ద
  5. నత్యంతను; నత్యుత్తమ.
  6. బొ మ్మూ రేల పేకేల నా
  7. బండి
  8. ధేను