పుట:హరివంశము.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 5.

121


వ.

ఆదేవు దివ్యావతారంబున సకలచరాచరంబులుం బ్రమోదభరంబు నొందె మంద
సమీరుండు సమీరితసౌరభసుఖస్పర్శుం డై చరించెఁ దాపసాగ్నిహోత్రంబులు
ప్రదక్షిణజ్వాలాజాలంబు లై వర్తిల్లె సాగరంబులు సమ్మదసంభ్రమంబులం బొదలె
దిశలు ప్రకాశంబు లయ్యె నంబరచరంబు లగుతేజంబులు తేజో[1]తిశయంబున
మెఱసె నంతర్ధానగతు లై యాదిత్యులు మోదంబునఁ గుసుమవర్షంబులు గురి
యించుచు ననేకవాక్యంబుల నమ్మహాప్రభావుం బ్రస్తుతించిరి దివ్యంబు లగువాది
త్రంబులు ప్రదీపధ్వనులం జలంగె గంధర్వగానంబులు నప్సరోనర్తనంబులుం
బ్రవర్తిల్లెఁ బాతాళవాసు లగువాసుకిప్రముఖు లుల్లాసభాసితు లై రిట్టి[2]వై జనన
సంప్రమోదసంకులంబునంద.

117


ఉ.

కావలివారిఁ దొట్టి పురిఁ గల్గుజనంబులలోన గాఢని
ద్రావివశత్వ మొందనివిధంబున వాఁ డొకరుండు లేఁడు ల
క్ష్మీవరుమాయఁ జేసి గతచేతసులై నటు లుండి రయ్యెడన్
దేవకియుం బ్రభుండు వసుదేవుఁడుఁ దక్కఁగ నెల్లవారలున్.

118


క.

ఆవృష్ణివీరుఁ డాత్మజు, నావిర్భావము నెఱింగి యంతర్గృహమున్
వేవేగఁ జొచ్చి నడురే, యావనజాప్తుండు వొడిచిన ట్లై యుండన్.

119


మ.

నెఱులై యొప్పు వినీలకేశములు నున్నిద్రాననాబ్జంబు నే
డ్తెఱ నూత్నాంబుదతుల్యకాంతియును నై దివ్యప్రభావంబునం
గఱయున్ మాఁగును లేక పుట్టినశుభాంగం బద్భుతాపాదియై
నెఱయం గన్నులు విచ్చిచూచుతనయున్ వీక్షించి మోదంబునన్.

120


తే.

పాపకరుండు కంసుఁ డీపట్టిఁ బట్టి, యెగ్గుసేయంగ నకట యే నెట్లు సూతు
నెవ్వరును గానకుండంగ నిపుడ కొనుచు, నరిగి యొండుచో డాఁచెదనని తలంచి.

121


సీ.

ఏ వేదనయు [3]నొంద కింపారఁ బుత్రునిఁ గని యింక [4]నెట్లొకో కర్జ మనుచు
నివ్వెఱపడి యున్న నిజపత్ని కవ్విధం బల్లన యెఱిఁగించి యవ్వరాంగి
తొడలపైఁ గల్పాంతతోయధివటపత్రతలమునం దున్నచందమున నున్న
శిశువు నొయ్యన నెత్తి చేతుల నల్లనఁ బొదివి చెచ్చెర నంతిపురము వెడలి


తే.

నందగోపునింటికిఁ జని నవ్యసూతి
యయ్యశోదయు విష్ణుమాయావిమూఢ
యగుట నొం డెఱుంగక యున్కి నాతఁ డచటఁ
గొడుకుఁ బెట్టి యాయమగన్నకూతుఁ గొనుచు.

122


వ.

మగుడఁ జనుదెంచి దేవకీదేవితల్పంబున [5]నిడి తాన పోయి తత్ప్రసవసూతంబు
కంసునకుం జెప్పిన.

123
  1. విశేషంబున
  2. భువన
  3. లేక యిం
  4. నెట్లకో
  5. నునిచి