పుట:హరివంశము.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

హరివంశము


తే.

యోగనిద్రాప్రభావసంయోజననమున, నొలయుషడ్గర్భులను గర్భముగఁ దాల్చె
ధీరతమ యగువసుదేవుదేవి దనకుఁ, [1]దివురుదేహదుఃఖం బెల్ల నవధిఁ బోవ.

106


చ.

అరసి ప్రసూతికాలమున యప్పుడు దక్షు లెఱింగి చెప్పఁగాఁ
గరుణ యొకింత లేక యెఱగందుల దేవకిగన్నయార్వురం
బరుషవిశాలఘోరశిలపైఁ గడకాళులు వట్టి వ్రేసి యా
సురముగఁ జంపెఁ గంసుఁ డురుశోణితము ల్చెదరంగఁ జెచ్చెరన్.

107


వ.

సప్తమగర్భంబు సప్తమం బగుమాసంబున విష్ణుని యోగనిద్రచేత సంకర్షించు
కొని పోవంబడి గోకులస్థిత యైనరోహిణి యుదరంబు నొందె నివ్విధంబున గర్భ
శోభనంబు సంప్రాప్తం బై.

108

రోహిణీదేవిగర్భంబుననుండి బలరాముం డవతారంబు నొందుట

క.

నెలలన్నియు నిండఁగ న, న్నెలఁతకు జనియించె నిండునెల పున్నమకున్
నెలకొని యుదయించుపగిది, నెలమఁగొడుకు సకలకువలయేచ్ఛాకరుఁడై.

109


వ.

ఇట్లు పూర్వవిహితనామధేయుం డగుసంకర్షణు జన్మానంతరంబ.

110


క.

దేవకియష్టమగర్భము, దేవోత్తముఁ డై నవిష్ణుదేవునియంశం
బావిష్కృత మయ్యె నఖిల, దేవహితార్థంబు దీప్తదివ్యవిభూతిన్.

111


క.

పదునాలుగుజగములు దన, యుదరంబున నునిచికొన్నయుదితమహిము నే
ర్పొదవంగఁ దాల్చె గృశమగు, నుదరంబున నువిద భాగ్యయోగముపేర్మిన్.

112


సీ.

పొక్కిట నెత్తమ్మి పొలుచునియ్యమపట్టి కనువిధంబునఁ దనరారె నాభి
హరినీలవర్ణుఁ డీహరిణాక్షిసుతుఁ డనుచాడ్పున నలుపెక్కెఁ జన్ను మొనలు
ధవళాబ్జనిభము లీతరుణీపుత్త్రునికన్ను లనులీల గడుఁ దెలుపారెఁ జూడ్కు
లధికనిద్రాళుఁ డీయబల[2]తనూజుఁ డన్భాతి జెయ్వుల జడభావ మొందెఁ


ఆ.

దనువు వెలరువారెఁ దగిలెఁ గోర్కులు కౌను, వొదలె వళులు విరిసె నొదవెఁ జెమట
లినసమానగర్భజనితశ్రమసమీర, ణమ్ము లమరె వికచనలినముఖికి.

113


క.

ఏదివసం బాదిగ ని, ట్లాదేవకి దాల్చె గర్భ మదియ మొదలుగా
మోదమున నందపత్ని య, శోదాదేవియును లీలఁ జూలు ధరించెన్.

114


వ.

[3]అంత నిక్కడ దశమమాసంబునందు.

115

దేవకీదేవిగర్భంబున నుండి శ్రీకృష్ణు డవతరించుట

మ.

మహితశ్రావణమేచకాష్టమి నిశామధ్యంబునం బ్రస్ఫుర
ద్గ్రహముల్ స్వోచ్చగృహంబులం ద[4]యిదు విభాజిల్లఁ [5]బుత్రున్ యదూ
ద్వహుఁ బుణ్యాంగన గాంచె విశ్వజగదాధారోదయున్ ధర్మని
ర్వహణారంభధురీణు నిత్యవిభుతావర్ధిష్ణునిం గృష్ణునిన్.

116
  1. దవులు
  2. సూనుం డన భానుచెయ్వుల
  3. తదనంతరంబ
  4. కడు
  5. గానయ్యదూ