పుట:హరివంశము.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 5

117


మ.

విను భాగీరథి లోనుగా ననఘ యుర్విం గల్గు తీర్థంబు లె
ల్లను నే నాడుచు దేవభూములకు నుల్లాసంబుతో నేఁగి సొం
పొనరన్ సూర్యసఖంబు నాఁ బరఁగు మేరూత్తుంగశృంగంబుపైఁ
గనుఁగొంటిం బరమేష్ఠిఁ దొట్టి సురసంఘం బేకతం బుండఁగన్.

82


క.

ఇట్టిపరస్పరమంత్రం, బెట్టిదొ యని యచట [1]నిలువ నే మని చెప్పం
బెట్టిదముగ నినుఁ జంపుట, కిట్టల మగువెరవు వెదకు డేర్పడ వింటిన్.

83


వ.

 మీ పెదతండ్రికూఁతు రైనదేవకీదేవి కయ్యెడు నెనిమిది యగు చూలు నీకు
మృత్యుహేతువు గాఁగలయది నిజం బిట్లు జనియించు పురుషుండు.

84


తే.

దేవతల కెల్ల శరణంబు దేవపూజ్యుఁ, డఖిలమునకు నాధార మనంతకీ ర్తి
యాత్మభవుఁడు సమస్తలోకాత్ముఁ డాతఁ, డెవ్వఁడో చెప్పనొయ్యన నెఱిఁగె దీవు.

85


క.

నీయోపినగతిఁ బ్రాణా, పాయప్రతివిధు లొనర్పు మర్థ మఖిలమున్
జేయుము పాత్రత్యాగం, బాయక భోగములు సలుపు మకళంకుఁడ వై.

86


వ.

ఇది యనంతరకర్తవ్యంబు నీమీఁది నెయ్యంబున నింతయు నెఱింగింప వచ్చితిం
బోయెద నని వీడ్కొని యమ్మహాముని నిజేచ్ఛం జనియెఁ గంసుండు నిజభృత్య
జనంబుల దెసఁ జూచి పెలుచ నవ్వి.

87


మ.

చతురుం డంచు నిలింపసంయమిదెసన్ సస్నేహ[2]మైయుండు మా
మతి మున్నెప్పుడుఁ గూళఁ డయ్యె నకటా మాబోఁటి సత్త్వాఢ్యులం
దతిహాస్యంబుగ నిట్లు వల్కఁదగునే యబ్జాసనుం దొట్టి యే
గతి నేవేల్పుల నేను గైకొనమి నిక్కం బాత్మఁ గానం డొకో.

88


తే.

మేలుకంటి నిద్రించితి మెలఁగుచుంటి, నొడ లెఱుంగకుండితి నెట్టు లున్ననైనఁ
గదిసి నాకుఁ గీడొనరింపఁగలుగువాని, నెఱుఁగ నిమ్మూఁడుజగముల నింతనిజము.

89


చ.

కినిసితి నేని [3]నిద్ధరణిఁ గీడ్పడఁ ద్రొక్కుదు [4]నంఘ్రులన్ దివం
బును దిశలుం బగుల్తు దృఢముష్టిహతిం బటుహుంకృతిన్ హుతా
శనపవనార్కశీతకరసంచరణంబులు నిల్వరింతు
పెనుపు గలంగునే గిరులు భేదిలినన్ జలరాసు లింకినన్.

90


వ.

అది యట్లుండె మఱియు నొకటి సెప్పెద.

91


చ.

కలపనగంప యీతపసి కాలును నోరును బాగుగాన కె
వ్వలనఁ బరిభ్రమించుచు నపాయపుఁబ్రేలరిమాట లాడి ధీ
రుల మదికైన నూరక విరోధ మొనర్చుచునుండు రాజులం
బెలుచన రేఁచి తెచ్చి తలపెట్టు వినోదపుఁదీఁటవోవఁగాన్.

92


వ.

అది యట్టిద యైన నే మిప్పుడు మన యరిష్టకేశిప్రలంబధేనుక పూతనాకాళియాహి
ప్రభృతులకుం జెప్పునది నారదుండు యదుకులంబువలన మన కపాయంబు

  1. నిలిచితే
  2. మైయుండ మా
  3. యిద్ధరణి
  4. సంధ్యలున్