పుట:హరివంశము.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

హరివంశము


వ.

ఇంకనైనను విడువం దగదె యది యట్లుండె.

70


ఉ.

ఎంతటివారినైన నొకయించుక ధర్మువు దప్పిరేని శా
సింతురు గాదె సద్విభులు చిత్తమునం దిడిచూడు మంతవా
రింతకుఁ జొచ్చిరేని తెఱఁ [1]గెయ్యది యెక్కడ లోకసేతు వ
త్యంతముపుణ్య మింతయును నారసి చేయుట నీకు నీశ్వరా.

71


క.

నా విని కశ్యపమునిదెస, నావిర్భూతమయి పేర్చె నస్మన్మతిఁ గో
పావేశము భావి యయిన, దేవహితంబును దలంచితిం దెల్లముగాన్.

72


వ.

అవి రెండునుం గారణంబులుగా నపుడు వరుణుం జూచి.

73


క.

ఏయాత్మతోడ గోవుల, నాయనహరియించె నట్టియాత్మయ కొని సు
శ్రీయుతుఁ డుర్వీస్థలి న, త్యాయతమతి గోపవర్యుఁ డై జనియించున్.

74


తే.

అతనిభార్య లిద్దఱుఁ దోన యరుగువారు, తప్ప దీతప్పునకుఁ దగుదండ మేను
నిశ్చయించితి [2]ననిన నప్పశ్చిమాధి, పతియుఁ గ్రమ్మఱఁ జనియె గోవితతిఁ బడసి.

75


వ.

ఇట్లు నాచేత శప్తుం డైన కశ్యపమునీంద్రుండు వసుదేవుం డన నుద్భవించి కంసు
గోవులకు నధికారి యయ్యె నతని పత్నులు దేవకియు రోహిణియు నై పుట్టి రయ్యి
ద్దఱు వనితలయందును నీవు నీ తేజంబు రెండంశంబులుగా విభాగించి యవతారం
బొనర్చి యదువంశంబు [3]బ్రశంస నొందింపు మవ్వరుణుగోవులుఁ దామై
పొడమిన గోవ్రజంబు లనేకంబులం బరిపాలించుచు నాత్మీయబాల్యంబు ప్రకట
కేళిలౌల్యంబు నొందింపంగలవాఁడవు.

76


శా.

నీలస్నిగ్ధవిలోలకుంతలము లున్నిద్రోరుబర్హస్ఫుర
చ్చూళంబుల్ వనమాలికాలలితవక్షోభాగముం గాంతిమ
చ్చేలాందోళనచారుకక్షమును నై శ్రీనాథ నీబాలగో
పాలాకారము చింత్య మయ్యెడు భువిన్ భవ్యాత్మకశ్రేణికిన్.

77


వ.

అని యిట్లు నీరజాసనుండు నిరూపించిన కార్యంబునం బ్రమోదంబు నొంది
గోవిందుం డందఱ వీడ్కొలిపి నిజస్థానం బగుదుగ్ధాబ్ధియుత్తరంబునకుం జనియెం
దదనంతరంబ.

78

నారదుఁడు కంసునితో విష్ణుమూర్తి కృష్ణుం డయి పుట్టఁగలవిధం బెఱిఁగించుట

క.

నారదుఁడు మథుర కరిగి యు, దారుం డగు నుగ్రసేనతనయునిసదన
ద్వారమున నిలిచి తత్ప్రతి, హారులు దోడుకొనిపోవ నటఁ బోవుటయున్.

79


ఆ.

ఎదురువచ్చి కంసుఁ డెంతయు నమ్రుఁ డై, యుజ్జ్వలాసనమున నునిచి వరుస
నర్ఘ్యపాద్యపూర్వ మగుపూజ యొనరించి, ముదితుఁ జేయుటయును మునివరుండు.

80


వ.

అతని వదనంబునం జూడ్కి నిలిపి తదీయులు విన ని ట్లనియె.

81
  1. గెక్కడి దెయ్యది
  2. బ్రీతుఁడై పశ్చి
  3. ఁబనుపడ జన్మంబు