పుట:హరివంశము.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

హరివంశము


వ.

తదనంతరంబ భక్తిప్రియపూర్వంంబుగా నద్దేవముని యద్దేవునకుం బ్రాంజలి యై
యిట్లనియె.

52


క.

మతిమంతుల కాద్యుఁడ వూ, ర్జితశక్తిసమన్వితులకు శ్రేష్ఠుఁడవు మహా
ధృతియుతులకుఁ బ్రవరుఁడ వ, చ్యుత నీయవి గావె సృష్టియును యోగంబున్.

53


వ.

కావున నిప్పుడు సకలక్షత్రియోపసంహరణార్థంబు దివిజు లిందఱుం గావింపం
బూనిన యంశావతారవ్యవసాయంబు భవత్పరిగ్రహంబు లేకున్న నింతయు
నిష్ఫలం బది యెట్లనిన.

54


మ.

ధరపై నీవు నిజాంశ మొక్కటి సముత్పాదించి దేవాంశజో
త్కరముం బాలన సేయఁ బేర్మి యెసఁగంగా వార లేపారి నీ
పరమోత్సాహముచే సనాథు లయి తీర్పంజాలి యుండుం గ్రియా
భర మెల్లమ బెఱనాఁడు గల్గునె తలంపం బ్రౌఢి యెవ్వారికిన్.

55


వ.

అది యట్లుండె నీ పార్థివక్షయకరణం బొక్కటియ కాదు దేవాంశజులకు నసా
ధ్యం బైన కార్యం[1]బు మఱియు నొక్కటిగ గల దదియ తలంచి కాదె యేను సత్వ
రుండ నై దేవరం దలఁపింప వచ్చితి నవ్విధంబు విన్నవించెద నవధరింపుము.

56


తే.

తారకామయం బను పేరిదారుణంపుఁ, బోర నీపరాక్రమమునఁ బొలిసినట్టి
యసుర లిప్పుడు మర్త్యంబునందుఁ బుట్టి, వాలి క్రతుహంతలైయున్నవారు దేవ.

57


సీ.

రఘురాముకడిమిచే రావణుం డనిలోన మడిసిన పిమ్మటఁ గడిఁదివీరుఁ
డమ్మహాసురుని మేనల్లుఁడు లవణుండు మధుదైత్యతనయుఁ డున్మార్గబలుఁడు
యమునాతటంబు ఘోరారణ్యముననుండి బాధ సేయంగఁ దపస్వు లెఱిఁగి
యెఱిఁగించుటయుఁ ద్రిదశేంద్రవంద్యుఁడు దనయనుజు శ్రుఘ్నునిఁ బనిచె నతఁడు


తే.

నరిగి శత్రునిఁ దెగటార్చి యడవియెల్ల, బయలుగాఁ జేసి యధికసంపన్నుఁ డగుట
[2]నొక్కనగరు నిర్మించె ననూనవిభవ, సారసంపన్నబహుజనోచ్చయము లలర.

58


వ.

అదియును మధువనంబునందు నిర్మిత యగుటం జేసి మధుర యను పేరం బ్రసిద్ధ
యై సమృద్ధజనపదసమన్వితయుఁ బ్రకటోద్యానతటాకగోపురవిలసితయుఁ బ్రశస్త
బహుభోగభూమియు నై నాఁటంగోలె నెన్నండును శూన్యంబు గాక
పరంపరాపరిపాలనంబునం బెంపుమిగిలె నిప్పు డప్పురంబున.

59


తే.

కంసుఁ [3]డనుపేరితో నాఁటికాలనేమి, భోజనంశోద్భవుం డగుభూవరుండు
నుగ్రసేనునకు జనించి యున్నవాఁడు, పూర్వదుర్వాసనాపరిస్ఫూర్తితోడ.

60


శా.

 రాజైయుండియు నెందు రాజగుణముల్ రాజిల్లు టొల్లండు స
త్పూజాయోగ్యత గల్గుబంధుతతికిం బొందీఁడు ఘోరాజులన్
రాజశ్రేణికి నెందు నోర్వభర మై భ్రాజిష్ణుతం గ్రాలు త
త్తేజం బాసుర మై తనర్చుటకు నుద్వేగించెఁ ద్రైలోక్యమున్.

61
  1. బదియొ
  2. నగర మొక్కటి నిర్మించె నగరవిభవ
  3. డనఁజను పేరితోఁ గాల