పుట:హరివంశము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 5.

111


తే.

మెచ్చితిమి నేము నీచేతఁ జచ్చుటయును, మాకు లెస్సయై తోఁచె నెమ్మనములందు
గమలనాభ చంపుము సలిలములు లేని, చోట నావుఁడు నాదైత్యసూదనుండు.

24


చ.

ఇరువురఁ జంకలం దిఱికి యేపెపలారఁగ బాహుపీడన
స్ఫురణ నొగిల్చి పెల్చఁ దెగఁజూచి జలంబులలోన వైచినం
దరళతరంగజాలములతాకునఁ దత్తనుయుగ్మకంబునం
[1]దొరఁగుచుఁ బేర్చి క్రొమ్మెండు తోరపుఁదెట్టువ గట్టె నయ్యెడన్.

25


క.

మేదస్సు పయిఁ [2]బొదువుటయు, మేదిని యన నాఁటఁగోలె మెచ్చగుపే రు
త్పాదించె నాకు నచ్యుతుఁ డాదరమున నర్థవేదు లభినందింపన్.

26


చ.

పిదప వరాహదేహమునఁ బేర్చిన [3]పంట నొకంట నన్ను ని
య్యుదధిజలంలో మునిఁగియుండఁగ నెత్తెఁ ద్రివిక్రమాత్ముఁ డై
పదమున నా కలంతయును బ్రాభవ మొప్పఁగ విక్రమించె న
భ్యుదయవిధాయి నాయెడఁ బ్రభుండు ముకుందుఁడు సర్వకాలమున్.

27


తే.

శంఖకౌమోదకీచక్రచారుహస్తు, నతవిధేయు [4]మన్నాథు ననాథనాథు
విష్ణుఁ బ్రభవిష్ణు జగదేకవిభునిఁ జెంది, యున్నదాన దిక్కరయ నాకొరుఁడు గలఁడె.

28


క.

గురుఁ డగ్ని సువర్ణమునకు, గురుఁ డర్కుఁడు తేకేజములకు గురుఁ డెల్ల నిశా
కరుఁ డఖిలతారకములకు, గురుఁ డెల్లవిధంబులను ముకుందుఁడు నాకున్.

29


క.

సకలచరాచర భేద, ప్రకటిత యగుసృష్టి యేను [5]భరియించు ప్రతి
ష్ఠకుఁ గతము వాసుదేవుం, డొకరుఁడె యాధారశక్తి నొసఁగుటఁ గాదే.

30


వ.

జామదగ్న్యుఁడు సర్వక్షత్రంబును నిశ్శేషంబుగా వధియించి రుధిరమాంసదుర్గంధ
దూషితయుఁ బరమవికీర్ణక్లేశయు నై రజస్వలయుంబోలె నున్న నన్నుం గశ్య
పునకు నధ్వరదక్షిణగా నొసంగిన నమ్మహాత్ము నాశ్రయించి.

31


తే.

పతులు వొలియుట విధవనై పాడువాఱి, యున్నదాన నే నేమిటి నోర్వ నింక
నోపు దీవు నన్నరయంగ నోపు భక్త, నిమ్ము కరుణింపవే సన్మునీంద్ర యనిన.

32


క.

మునినాథుఁ డట్ల కాకని, మనువున కిచ్చె నను నధికమహిమాన్వితుఁ డా
జనపతియు నాత్మవంశ్యులం, బనిచెం బరిపాటితోడఁ బరిపాలింపన్.

33


వ.

మహాకులీనులు [6]ధీరులు మునిజనసమ్మతాచారులు శూరులు నైన యాజగదేక
పతుల చేత ననుభూత నైతి వారు [7]నాకుఁగా బ్రతికి నాయంద కాల[8]వశత నొందిరి
మీ రెఱుంగనిపని లే దిప్పుడు రాజకుటంబు కొలఁదికి మిగిలి నాకు భరియింపం
గొలఁది గాకున్నది భారవహనక్లేశంబునం గృశియించి యున్నదాన నొక్కింత నా
మోపు వెలితిచేసిన బ్రతుకుదు నివ్విధం బివ్విష్ణుదేవుండు దలకొనియె నేని
నిర్వహించు నితం డూరకయున్న నది మదీయభాగ్యం బేమి సేయవచ్చు నిచ్చటి
పెద్ద లీదుష్కరంపుఁగార్యం బనివారఁంబుగా సంఘటింపం బ్రయత్నంబు సేయ

  1. దొరుగుచు
  2. బొదవు
  3. కోరనొకంట
  4. ని మన్నాథు నాదదేవు
  5. భారావృతనిష్ఠకు
  6. నధికులు యదీర్ణులు
  7. నాక లా
  8. వశంబు