పుట:హరివంశము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4.

101


తే.

బాఱెఁగరియును నొకభంగి [1]బ్రతికి విగత, [2]తోయమగు తోయమునకు దోయనంగ
మదవిహీనమై యచ్చోన కదలకుండె, నస్తనిర్ఝరభృతి యగునద్రివోలె.

148


వ.

ఇట్లు మహేంద్రు మర్దించి యమ్ముఖంబున నమ్మహాదైత్యుండు.

149


క.

ఫణిపాశము ద్రెంచి ధను, ర్గుణనిస్వన మడర వాఁడికోలలఁ దనువున్
[3]వ్రణితము నొనర్చి వరుణుని, రణకర్మోద్యమమునకుఁ బరాఙ్ముఖుఁ జేసెన్.

150


వ.

మఱియును.

151


క.

పరిఘమున నురము శిరమును, బరియు నడఁచి ధనదు మూర్ఛపాలువఱచి కి
న్నరకోటిఁ బఱపి యాతని, సిరితోడన నిధిచయంబుఁ జేకొనియె వడిన్.

152


వ.

తదనంతరంబ.

153


[4]సీ.

మెచ్చక యెదురైనమృత్యువు మెడ ద్రొక్కి క్రొవ్వాడికోఱలు [5]ద్రెవ్వదాఁచి
కింకతో [6]జంకించి కిన్నరగణముల పొంకంబు సెడఁ గొంకువోవ నడిచి
[7]మదురువు గొని మాఱుమలయు కారెనుఁబోతు [8]నొడిసి కొమ్ములు పట్టి మడఁగ ద్రొబ్బి
మండెడుపటుకాలదండంబు చేతులఁ బిసికి వేఁడిమి యార్చి బెండు చేసి


తే.

[9]పిఱికిప్రాణులఁ బొరిగొను బిరుదుమగఁడ
వగుదు నీ వని యందంద మొగముమీఁదఁ
జప్పటలు వెట్టి యాతఁడు జమునిలావుఁ
జేవయును [10]బొల్లగాఁ గాకు చేసి విడిచె.

154


వ.

ఇత్తెఱుంగున లోకపాలురుం దూలినఁ దక్కినవేల్పులు కన్నవారు కన్నతెరువునం
బఱచిరి గాలనేమియుఁ దత్తత్పదంబు లాక్రమింపఁ దగిన యధికారులం బనిచి.

155


శా.

స్వర్గద్వారము గాయుదీవ్రకరు నుత్పాటించి తారాగణాం
తర్గామిం దుహినాంశుఁ ద్రోచి త్రిజగత్సంసేవ్యు హశ్యాశనున్
దౌర్గత్యాన్వితుఁ జేసి వారి నెలవుల్ దానై తదీయక్రియా
సర్గంబున్ దనసొమ్ముగాఁ గొనియె నాశ్చర్యోగ్రవీర్యంబునన్.

156


వ.

మఱియునుం [11]బ్రభావబంధురుం డగుట [12]ననిలస్కంధంబులు నూర్ధ్వభువనబంధం
బులు నతని యధీనంబులయ్యె సకల[13]సాగరశిలోచ్చయసమేతయగుభూతధాత్రియు
నతనిచేతికి వచ్చి తచ్చండశాసనంబున నిలిచె నప్సరోగంధర్వాదులుం దదీయ
సేవావృత్తంబ యూఁదిరి దేవతలు చెడిపోయి పలుచోట్లం బడియుండి రివ్వి
ధంబునుం గనియును విష్ణుండు వానికిం గాలపరిపాకం బగుట యపేక్షించి యూర

  1. బ్రదికి
  2. తోయదంబునకుం దన్నుఁ
  3. బ్రణతగ
  4. ఇంచుకమార్పుతో నీపద్యము నృసింహపురాణములో రెండవయాశ్వాసమున 119 వ పద్యముగ నున్నది.
  5. ద్రెవ్వరాల్చి; రాచి.
  6. జంకించు
  7. వధువును . . . పడియఁద్రోచి
  8. వడసి
  9. పేద
  10. బ్రోవఁగాఁగాకు సేసి
  11. బ్రతాప
  12. నిజ
  13. జలధి