పుట:హరివంశము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

95


బ్రళయాగ్నిశిఖలు పైఁ బ్రసరించు క్రోధసంరక్తవిలోచనప్రభలవాని
నిఖిలాండములు నొక్కనెగవున దాఁటంగఁ గలయద్భుతోగ్రవేగంబువాని


ఆ.

వైనతేయు నింద్రవజ్రావమానన, చండశౌర్యు నెక్కి చక్రశార్ఙ్గ
గదలు దాల్చి కడిమిఁ గడఁగె సర్వాభయ, ప్రదుఁడు శ్రీవిభుండు బవరమునకు.

94


వ.

అద్దేవునకుం దలకడచి పాకశాసనుండు లోనగులోకపాలురు సకలసురగణం
బులం గొని దనుజనివహంబులం దలపడిన నసురలు నసహ్యరంహస్సంపాతంబున
నిలింపులం గైకొనక [1]తఱిమిన.

95


తే.

కరులు కరులును హరులును హరులు నరద
ములు నరదములుఁ గాల్బలములునుఁ గాలు
బలముఁ దాఁకంగఁ గయ్య మగ్గలికఁ [2]బేర్చె
రెండు[3]మొనలకు నతిరౌద్రరేఖ బెరయ.

96


మ.

పరిఘప్రాసశరాసిశక్తిముసల[4]ప్రవ్యగ్రశస్త్రౌఘని
ర్భరనిర్భిన్నశరీరు లై దితిసుతవ్రాతంబుచే దివ్యులున్
సురసంఘాతముచేత దానవులు నస్తోకంబులై నెత్తురుల్
దొరుగం బుష్పితకింశుకో[5]జ్జ్వలత విద్యోతించి రేకాకృతిన్.

97


వ.

తదనంతరంబ.

98


ఉ.

ఏపున దానవు ల్మిగిలి యెందును వేలుపుమూఁకఁ గ్రూరమా
యాపరికీర్ణపాశనిచయంబులఁ గట్టినఁ జేతు లాయుధ
[6]వ్యాపృతి దక్క నంఘ్రులు ప్రవర్తనశూన్యత నొంద వాహముల్
[7]ప్రోపఱ నెల్లవారలు బ్రభూతభయార్తిఁ గలంగి [8]రయ్యెడన్.

99


ఉ.

అంతయుఁ జూచి గోత్రభిదుఁ డాత్మవిభూతిఁ దదీయమాయ పెం
పంతయు [9]మాన్చి యంధతమసాంబకపంక్తుల నంబరక్షితి
ప్రాంతము లెల్లఁ గప్పుటయు నన్యులఁ దమ్మును గానలేక వి
భ్రాంతతఁ బొంది తూలెడువిపక్షులఁ గూల్చిరి పేర్చి నిర్జరుల్.

100


చ.

అసురలు సావఁగాఁ గని తదగ్రణి యైనమయుండు రోషసం
ప్రసరకఠోరనేత్రశిఖ పర్వఁగ నౌర్వునిచేత సృష్ట మై
యెసఁగెడుమాయ నప్పు డెలయించినఁ బుట్టె యుగాంతసంభృత
ప్రసభకృశానుతుల్య మగు పావకసంచయ మద్బుతోద్ధతిన్.

101


ఉ.

ఆతీవ్రానలుపేర్మి వాసవతమిస్రాస్త్రప్రభావంబు ని
ర్ధూతంబై చెడ నంతఁ బోక యది యెందుం దానయై పర్వి స

  1. తఱమిన
  2. బరఁగి
  3. మొనలును
  4. ప్రాయోగ్ర
  5. జ్జ్వలితన్
  6. వ్యాప్యతి
  7. పాపఱనెల్లవారలు ప్రభాత; పోషఱ; పోపడ.
  8. రమ్మెయిన్
  9. నీఱు చేసి