పుట:హరివంశము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివంశము

91


ధనచయకోటి యొప్పఁగ నుదగ్ర[1]పతాకనభోగ్రభాగచుం
బిని యయి క్రాలఁగాఁ జనియె భీతివిదూరుఁడు దారుఁ డాజికిన్.

82


క.

గద పూంచిపట్టి మహి గ్ర, క్కదలఁగఁ దొక్కుచును నడచెఁ [2]గాల్నడతోఁ బెం
[3]పొదవి విరోచనుఁడు సమ, భ్యుదిత[4]శిఖర మగు[5]చరిష్ణుభూధరముక్రియన్.

83


తే.

వేయి గుఱ్ఱముల్ పూనినవెడఁదయరద, మర్థితో నెక్కి రిపుకోటి నదరఁ జేయఁ
జాలుకడఁక హయగ్రీవుఁ డాలమునకు, నరిగెఁ దనుఁ జూచి దనుజులు హర్ష మొంద.

84


క.

వేసేతుల నిడుపగు బా, ణాసనము గుణస్వనోగ్ర మగునట్లుగ ను
ల్లాసంబునఁ ద్రిప్పుచు ఘో, రాసురుఁడు వరాహుఁ డొప్పె నఖలధ్వజినిన్.

85


క.

[6]విక్షరుఁడు క్రోధదహన, ప్రకరణోగ్రాక్షుఁ డగుచుఁ బటురథవేగ
ప్రక్షుభితక్షితి యగుగతి, వీక్షింపఁగ విస్మయముగ వెస నని కమరెన్.

86


క.

అష్టాదశగజరభసా, క్లిష్టం బగురథముమీఁదఁ గేలఁ గడిఁది వి
ల్లిష్టమునఁ బట్టి మెఱసెన్, ద్వష్ట యనిష్టభట[7]మథనతత్పరశక్తిన్.

87


తే.

శ్వేతుఁ డనఁగ విశృంఖలశ్వేతహరుల, యరదమున విప్రచిత్తికి నాత్మజుండు
శ్వేతరత్నవిభూషణశ్వేతవసన, లసితుఁ డై శ్వేతగిరిమాడ్కి నెసఁగెఁ జూడ.

88


క.

బలిసూనుఁ డరిష్టుం డను, బలియుఁడు బలవద్గజేంద్రపరికల్పన ను
జ్జ్వలుఁ డై యొప్పఁగ నార్చుచుఁ, బొలుపారె సతోయజలదపోతంబుక్రియన్.

89


తే.

కడిఁదియసుర [8]బాణుండును గడఁగి మేఘ, వాహ మభినవగమననిర్వాహలీల
మెఱయునట్లుగఁ జూపుచు [9]మెఱసె సైన్య, మధ్యమునఁ దుల్యుఁడై [10]వియన్మధ్యరవికి.

90


క.

లంబాభరణంబులతో, లంబుఁడు దానాతిభరవిలంబితగమన
స్తంబేరమంబు నెక్కి బ, లంబులకుం దిలకమయ్యె లలితవిభూతిన్.

91


తే.

సైంహికేయుండు దీప్తోరుసింహవక్త్రుఁ, డహితబలముల మ్రింగుదు ననువిధమునఁ
జెలఁగి సెలవులు నాకుచు జిహ్వ తార, నేత్రముల రౌద్రరసరేఖ నిర్వహించె.

92


వ.

మఱియు ననేకు లనేకవాహనంబులతోడ ననేకాయుధహస్తు లై నడచి రిట్లు
గూడిన దానవానీకంబు సురపతాకినికి నభిముఖంబుగా మోహరించెం బ్రవర్తిత
తూర్యఘోషభీషణసంకులంబు లగునబ్బలంబులు రెండును బ్రళయమారు
తోద్ధూతకతరంగధ్వనిభీకరంబు లగు రత్నాకరంబు లొండొంటిం దార్కొను
తెఱంగునఁ గదియ నడచె నాసమయంబునఁ బూర్వాధిష్ఠితం బగురథంబు డిగ్గి.

93

త్రివిక్రమదేవుండు గరుడవాహనారూఢుం డై దేవతలకు సహాయం బగుట

సీ.

పసిఁడికెందగడు పైఁబఱపినయట్లు దిక్కులఁ బక్షకాంతి పైకొలుపువాని
ముందట నెఱసంజ మొలపించు చంచుదష్టోరగమణిదీప్తి నొప్పువానిఁ

  1. తరధ్వజమభ్ర
  2. కాల్నడ మొనకాస్పదముగ
  3. వదలి
  4. శిరంబగు
  5. వరిష్ట; పటిష్ఠ
  6. వృక్షకుఁడు
  7. దమన
  8. కిశోరుండు ఘనకిశోర
  9. ఁదిరిగి
  10. కనన్మధ్య