పుట:హరివంశము.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

93

పూర్వభాగము - ఆ. 4


బునం బొలుపారఁ బ్రబలవలాహకమాలికాపరివృతం బై విద్యుదింద్రాయుధా
లంకృతం బైన యభ్రమాతంగంబు నెక్కి యుక్కు మీఱి వేయిగన్నులుం గన్న
కౌతుకంబునం బ్రతివికాసంబు నొందు నస్పందవిభవంబునఁ బ్రభూతభిదుర
పాణి యై భాసిల్లె నతని కెలంకులం బిఱుందనుం గఠోరదండహస్తుండును గాల
మృత్యుసహాయుండును నపరిమితవ్యాధిపరివారుండును నగుపరేతపతియు సకల
సాగరభోగిప్రకరపరివృతుండై సుజాతముక్తామరకతభూషణంబుల భూషితం బగు
దేహంబుతోఁ బాశప్రకరంబు కరంబున నదుర వరుణుండును యక్షరాక్షసులు
కోట్లు గొలువ శంఖపద్మాదినిధు లిరుదెసల నిలువఁ బుష్పకాధిరోహణంబున
మెఱసి మహాగద కేలం గ్రాల నుల్లసిల్లు సాక్షాత్త్రిలోచనుండపోలెఁ ద్రిలోచన
సఖుండును నఖండగర్వంబునం దనర్చిరి తక్కిన దిక్పాలురుం దమతమపరివారంబు
లతో నాత్మీయవాహనంబులు మహనీయంబులుగా నొప్పిరి సప్తతురంగరయ
తరంగితాకారం బై యనూరుసారథ్యవిస్ఫారం బైనతేంతోడ వారిరుహమిత్రుం
డును విచిత్రగతిత్వరితం బగు [1]సీతాశ్వంబుల శాశ్వతం బగు సమందస్యందనంబున
జందనసుందరం బగుశరీరం బేపారం దారాపరివారుం డై నీహార[2]ప్రసారణ
కరుండును సురసైన్యమధ్యం బలంకరించి పరిస్ఫుటస్ఫటాచక్రంబు లెసంగఁ
జక్రిప్రభువులు ప్రభూతదంష్ట్రాశస్త్రు లై దుర్విషహవిషానజ్వాలాజాలంబుల
నంబరంబు వొదువుచు దనుజభయదం బగునాటోపంబు వాటించిరి శైలేం
ద్రులు సాంద్రపాషాణతరువర్షంబు లమర్షంబునం బగఱపైఁ గురియువారై పేర్చి
రిట్లు సుసంఘటితసన్నాహం బగు వివిధవ్యూహంబు గైకొని కన్నాకై వెన్నుండు
వేవురు విభాకరులునుం బదివేవురు ప్రళయమహాపావకులును ప్రోవుగట్టినట్టిపగిదిం
దేజ ప్రతాపంబులు విపక్షదురభిక్షేపంబు లై యేపార దీపించె నంత నింతయు
నెఱింగి యక్కడ.

78

మయుఁడు మొదలగు రాక్షసులు దేవతలమీఁద యుద్ధసన్నద్ధు లై వెడలుట

తే.

విఱిగిపోయి క్రమ్మఱ నొకవిష్ణుఁ జేతఁ, బట్టి పోటొగ్గి వచ్చెద రిట్టి దివిజు
లయిన [3]నేమయ్యె నిది చూడుమనుచు దితిజు, లఖిలసైన్యంబుఁ దగనేకముఖము సేసి.

79


వ.

నిర్భరోత్సాహంబున నడపి రట్టి యెడ.

80


మ.

విలసచ్చక్రచతుష్క మై ఘనతరద్వీపిత్వగావేష్టనో
జ్వల మై కిష్కుచతుశ్శతత్రితయవిస్తారాఢ్య మై రెండువే
లెలువు ల్పూనిన కాంచనోజ్జ్వలరథం బిం పెక్కఁగా నెక్కి యు
త్కలుఁ డై యేఁగె మయుండు సైన్యమున కేకస్వామి యీతం డనన్.

81


చ.

ఇనుమునఁ జేసినం బొలుచు నెన్మిది[4]గండుల తేరువేయు పెం
పెనసినగర్దభంబులు వహింపఁగఁ గ్రోశము విప్పు గల్లి సా

  1. శ్వేతా, పితా.
  2. ప్రహరణ
  3. మే మెదిరినఁ
  4. గండ్లగు