పుట:హరివంశము.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

హరివంశము


దేవదానవులకు జరిగిన తారకామయం బను యుద్ధప్రకారము

ఆ.

అనఘ కృతయుగంబునందు వృత్రధ్వంస, మయినపిదపఁ దారకామయంబు
నాఁగఁ జెల్లె నొకరణమ్ము దేవతలకు, చానవులకు నధికదారుణముగ.

72


క.

అందు సురారులచేతం, గ్రందుగ సురసిద్ధయక్షగంధర్వాదుల్
సందళితదేహు లై భీ, తి దూలి తలంచి రాదిదేవు ముకుందున్.

73


వ.

అట్లు దలంచుటయు నార్తశరణ్యుండు గావున విక్రాంతజగత్త్రయుం డగుత్రివి
క్రముండు విక్రమోత్సుకుం డై సజలజలధరశ్యామం బగుదివ్యదేహంబు హే
మాంబరకౌస్తుభ[1]హారంబుల మాణిక్యముకుటంబున దేదీప్యమానం బై సకల
ధాతుమయం బగు సమున్నతాంజనశైలంబు గ్రేణిసేయఁ జక్రశార్ఙ్గగదాఖడ్గశం
ఖంబులు సాకారంబు లై పరివేష్టింపఁ జంద్రసూర్య[2]చక్రంబును మందరమహీథ
రాక్షంబును మేరుగిరికూబరంబును ననంతరజ్జుసంబంధంబును దారకాకుసుమపరి
కీర్ణంబును గరుడధ్వజవిభ్రాజితంబును నగు భువనరూపస్యందనంబు నధిరోహించి
యాకాశంబున నాకౌకసుల యాలోకనంబులకు నభిగమ్యుం డైనఁ గృతాంజలు
లై వారు జయ జగన్నాథ జయ జనార్దన జయ హృషీకేశ జయ సర్వభూ
తేశ్వర యనునివి [3]యాది యగు వివిధస్తోత్రకీర్తనంబులు మున్నుగాఁ గీర్తనం
[4]బొనర్చి దివిజవరులు తమకు నైన భయంబులు విన్నవించినఁ బ్రసన్నుండై మధుర
గంభీరభాషణంబుల నవ్విభుండు వారి కభయం బిచ్చి తద్విరోధుల వధియించు
టకు బ్రతిజ్ఞ చేసిన.

74


ఆ.

సత్యసంధుఁ డైనచక్రాయుధునిపూన్కి, యమృత మర్థిఁ గనినయట్లు గాంచి
దివిజవరులు మున్ను దిగులుసొచ్చినమనం, బులు కలంకదేఱి పురికొనంగ.

75


వ.

సమరోద్యుక్తు లై రాసమయంబున.

76

దేవతలు రాక్షసులమీఁద యుద్ధసన్నద్ధు లై వెడలుట

చ.

వనజహితుండు దీప్తవిభవంబున నొప్పె నశేషదిక్కులుం
దనరెఁ బ్రసన్న లై పరమతాపసవర్యులు వేల్వ హవ్యవా
హనుఁడు ప్రదక్షిణార్చి నెలవారెఁ గరం బనుకూలవర్తి యై
యనిలుఁ డెలర్చె నిర్జరుల కయ్యెడుశత్రుజయంబు దెల్పుచున్.

77


వ.

అట్టికల్యాణనిమిత్తంబులకుఁ జిత్తంబుల నుత్సాహంబు లొదవి పొదలుచు వసు
రుద్రాదిత్యామరుదశ్వివిశ్వేసాధ్యులు సపరివారు లయి పురుహూతపురోభాగంబున
కరుగుదెంచి రతండును బిశంగహయసహస్రయుక్తంబును [5]సముద్దీప్తాశనిధ్వజ
విరాజితంబును దేజోవిరాజితార్కమండలంబును బ్రచండమారుతమనోజవంబును
సువిహితత్రిదశమనోరథంబును నగు తనరథంబు మాతలిసారథికం బై పార్శ్వం

  1. హారము
  2. రథాంగంబును
  3. మొదలుగా
  4. దర్శనం
  5. సముద్రిక్తాశ