పుట:హరివంశము.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

71


రోముండును ధైత్తిరుండునుం గడచిరి తైత్తిరునకుం గొడుకును మనుమండును
నై పునర్వసుండును నభిజిత్తుండునుం బరఁగిరి.

147


క.

అభిజిత్తునకు మహాయశుఁ, డభిమానసమున్నతాత్ముఁ డాహుకుఁ డనఁగాఁ
బ్రభవించె ననుజయై జగ, దభినుత యాహుకి జనించె నవనీనాథా.

148

అంధకవంశక్రమంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

వ.

ఆ యాహుకి యవంతీశ్వరునకుం బత్ని యయ్యె నాహుకుండు సర్వవంశప్రదీపకుం
డై బంధుజనంబు నాత్మసదృశవిభవోజ్జ్వలంబుగాఁ [1]బెనిచి యనంతగజతురంగపరి
వార మగురాజ్యలక్ష్మి యేకభోగ్యంబుగా నుల్లసిల్లె.

149


సీ.

అతనికిఁ గాశిరాజాత్మజయందు దేవప్రభునిభులు దేవకుఁడు నుగ్ర
సేనుఁడు ననఁగఁ బ్రసిద్ధులు పుట్టి రాదేవకునకు నోలి దేవవంతుఁ
[2]డన సుదేవుఁ డనంగను సుపదేవుం డన దేవరక్షితుఁ డన దీప్తభుజులు
కొడుకులు నలువురు కూఁతులు దేవకియును శాంతి యనుదేవయును సుదేవ
తే. యును ననఁగ దేవరక్షితయును మఱివృక, దేవియును సుపదేవియు శ్రీవిశాల
యైన శ్రీదేవులే యన ననుపమాన, సరసమూర్తులు జనన మొందిరి క్రమమున.

150


వ.

ఉగ్రసేనునకుఁ గంసుఁడు జ్యేష్ఠుండుగా గ్రమంబున న్యగ్రోధుండును సునాముం
డును గుహ్యుండును [3]శంకుండును సుభూమిపుఁడు రాష్ట్రపాలుండు సుతనుండు
ననాధృష్టండు సారసుండు పుష్టిమంతుం డనఁ [4]దొమ్మండ్రు కొడుకులును గంసయుఁ
[5]గంసవతియు సుతనువు రాష్ట్రపాలికయు [6]గుహ్యయు నన నేవురుకూఁ
తులుం బుట్టిరి.

151


క.

ఈకుకురువంశకీర్తన, మాకర్ణించిన మనమ్మునందు నిలిపినం
జేకుఱుఁ బ్రజాసమున్నతి, శ్రీకలితం బైనసుచిరజీవన మొదవున్.

152


వ.

అంధకద్వితీయపుత్రుం డైన భజమానునకు [7]విదూరథుండు విదూరథునకు
శూరుండును శూరునకు శమియు శమికిఁ బ్రతిక్షితుండును బ్రతిక్షితునకు హృది
కుండునుం బుట్టిరి హృదికునకుఁ గృతవర్మపూర్వజుండుగా శతధన్వ దేవార్హులు
జనియించి రివ్విధంబున సత్వతనూజు లైన భజమాన దేవాపృథమహాభో
జాంధకులయన్వయంబులు సెప్పంబడియెఁ గడపటివాఁ డైన వృష్ణివంశంబు
ప్రశంసించెద.

153


క.

విను గాంధారియు మాద్రియు, ననఁగా వృష్ణికిఁ బురంధ్రు లందు [8]మొదటియా
లనఘుఁ గనియె మిత్రవివ, ర్ధనుని సుమిత్రుని నమిత్రదళనధురీణున్.

154
  1. జేసి
  2. డన నట యుపదేవుఁడన వసుదేవుండు నన
  3. రంహుం
  4. బదుం
  5. నంసపతియు
  6. ఁగంకయు
  7. విడూరథుండు
  8. దొలుత