పుట:హరివంశము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

హరివంశము


బుట్టిరి మఱియుఁ గ్రమంబున వ్యోమజీమూత[1]నికృతులును భీమరథనవరథదశ
రథులును శకునికరంభదేవరాతదేవుక్షత్రులు నన, బదితరంబు లరిగిన.

139


క.

మధురవచనుఁ డదయించెను, మధు వను వసుధావిభుండు మాధవు లనఁగా
నధరీకృతాన్యనృపతులు, సధర్ము లాత్మీయు లాత్మసంజ్ఞఁ దలిర్ప.

140


క.

పురుఁ డన మధునకుఁ బుట్టెం, బురుషాగ్రణి యైనసుతుఁడు పురునకుఁ బుట్టెం
బురుహోత్రుఁ డతని కంగుఁడు, పురుహూతపరాక్రముండు పుట్టె నరేంద్రా.

141


వ.

అంగునకు సత్వతుండు వుట్టెఁ దద్వంశ్యు లెల్లను సాత్వతు లనం బరగిరి సత్వ
తునకు భజమానుండు దేవాపృథు డంధకుండు మహాభోజుండు వృష్ణి యను
పుత్రులు జన్మించి రందు భజనూనునకుం [2]గ్రిమియును గ్రమణుండును [3]గృష్ణుం
డును దశజిత్తును శతజిత్తుండును సహస్రజిత్తుండు నయుతజిత్తుండు ననం బెక్కండ్రు
గలిగి పెక్కువంశంబులు గలిగించిరి దేవాపృథుండు బహుయజ్ఞకర్తయై సర్వగుణ
పవిత్రుం డగు పుత్రుం బడయుదు నని.

142


క.

పర్ణాశనదీతటమున, నిర్ణయముగఁ దప మొనర్ప నెయ్యముమై న
య్యర్ణవగంభీరుని గుణ, పూర్ణతఁ గనుఁగొని ప్రియంబు వుట్టిన మతితోన్.

143


వ.

అమ్మహాతరంగిణి పరమమంగళం బగు నంగనారూపంబున నాభూపాలు వరియించె
వారికి బభ్రుండు పుట్టె నట్టి తండ్రికిం గొడుకునకు జగంబులయందు.

144


ఆ.

దేవసన్నిభుండు దేవాపృథుండు దూ, రమున వినిన[4]యజ్ఞరమ్యపదము
లరయఁ జేరి చూచినప్పుడు బభ్రుని, గుణము [5]లనఁగఁ గీర్తిఘోష మెసఁగె.

145


తే.

ఆఱువదియు నాఱువేలు నా నమలుసంఖ్య
గలుగుపురుషులు మును ముక్తిగలుగువారు
వారు పొందినగతియ దేవాపృథుండు
బభ్రుఁడును బొంది రండ్రు సద్బ్రహ్మవిదులు.

146


వ.

మహాభోజుండు మహాధర్మశీలుం డై బహుయజ్ఞంబులు బహుదక్షిణంబులుగా
నొనర్చి యపరిమితసువర్ణగోదానంబు లనుష్ఠించి బ్రాహ్మణభక్తి నిర్వహించి గర్వి
తారాతిదళనంబునం బరమక్షాత్రంబు జైత్రంబు గావించి వెలసె నతని వంశంబు
రాజులు మృత్తికావతీతీరభూము లేలి మార్తికావతు లనం బెంపొందిరి వారిలో
నశ్వఫల్గుం డత్యంతసమాఖ్య వడసె నతనికి నక్రూరచిత్రకులు పుట్టి రక్రూ
రునకు సుదేవోపదేవులు చిత్రకునకుఁ బృథవిపృథు లాదిగాఁ బెక్కండ్రు కొడు
కులును శ్రవణశ్రవిష్ఠ లనుకూఁతులు గలిగిరి మఱి యంధకునియన్వయంబు
వినుము కుకురుండు భజమానుండు [6]శుచి యనువార లంధకప్రసూతులు
వారియందుఁ గుకురునకు ధృష్టుండు పుట్టె ధృష్టునకుఁ బుత్రపౌత్రులయి కపోత

  1. భృహతులును
  2. గృమియు
  3. ధృష్ణుండును.
  4. యట్ల
  5. గనఁగ
  6. శమీకుండు బలబర్హిషుండు నను