పుట:హరివంశము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

69


నవాఁడై మదిలోఁ దన, యనపత్యత సూచి రాగ మతిశయ మొందన్.

130


క.

సంతతి లేకున్నను మ, త్కాంతపయి న్వేఱయొకతెఁ గామింపక యే
నెంతయు ధృతి నుండితి నిది, యింతయు విధిఘటన దీని నేను వరింతున్.

131


వ.

అని యబ్బాల నరదంబుపై నిడికొని మగిడి తనపురంబునకుం జనుదెంచి యంతి
పురంబు సొచ్చునప్పు డవ్విజయోత్సవంబున.

132


క.

కైసేసి తాను సుదతులు, సేసలు పెట్టుటకు శైబ్య చిత్తంబున ను
ల్లాస మెలర్ప నెదుర్కొని, యాసరసిజనయనఁ గనియె నరదముమీఁదన్.

133


చ.

కని మది నీసుతో నలుక గ్రమ్మన [1]నుప్పతిలంగ దండు పో
యినపని నాథ నిటు లెంతయు బాగయి వచ్చె నొక్కతె
న్ననువునఁ దేరిపై నిడుకొనం బదిలంబుగ నుంచి యిమ్మెయిం
గొని చనుదెంచి తౌఁ దగుఁ దగు న్నవరక్తులు గారె భూపతుల్.

134


తే.

అనిన నాతఁడు భయమున నబల నీకు, దీనిఁ గోడలిఁగాఁ గోరి తెచ్చినాఁడఁ
బార్థివాత్మజ నుత్తమభద్రమూర్తి, నెలమిఁ గైకొను మనిన నయ్యిగురుఁబోఁడి.

135


చ.

తనయులు నాకు లేరు మఱి తన్వి తనూజసమేత నీకు లే
దనయము దీనిఁ గోడ లనునట్టివిధం [2]బొకఁ డెద్ది సెప్పుమా
యన విని నీవు కాంచఁగల వాత్మజు నొక్కని వాని కెంతయుం
బెనుపుగ నిప్పయోజముఖిఁ బెండిలిసేయుదుఁగాక వేడుకన్.

136


వ.

ఇట్టి భవిష్యత్భావంబు నిరూపించి యిక్కన్యం దోడ్కొని వచ్చితి నని యతం
డప్పు డప్పడంతికి నొండుత్తరంబు సెప్ప వెరవు గానక యిట్లు పలికిన నల్లన నవ్వుచు
నవ్వామనయన యవ్వరాంగి నంగీకరించె [3]నివ్విధంబునం బరిణయవయస్క
యై యుండ నాశైబ్య కతిపయదివసంబులకు గర్భంబు దాల్చి కొడుకుం గనియె
వానికిఁ దండ్రి విదర్భుం డను పేరు పెట్టి గారంబునం బెనిచి కౌమారంబునం
బూర్వజన్మతపోగౌరవంబుకలిమిం గుమారీభావంబు పొలివోవక యున్న
యన్నాతి నతనికి నుద్వాహం బొనర్చె నదియును స్నుషాభిధానంబున [4]నెందును
వెలసి.

137


క.

క్రథకైశికు లన నిద్దఱఁ, బ్రధితయశులఁ గాంచెఁ రోమపాదుఁ డనఁగఁ బ్రో
న్మథితరిపుని మూఁడవసుతుఁ, బృథివీసమగుణు రణోగ్రుఁ బిదపం గనియెన్.

138


వ.

ఆరోమపాదునకుం బభ్రుండును బభ్రునకు ధృతియునుం బుట్టిరి తత్పుత్రపౌత్ర
పరంపర బహు[5]ముఖంబుల నెగడెఁ గైశికునకుం జేది యుద్భవించె వానివలనఁ
జైద్యాన్వయంబు గలిగె స్నుషాప్రథమపుత్రుం డగు క్రథునకుఁ గుంతియుఁ
గుంతికి ధృష్టుండును ధృష్టునకు దాశార్హుండును [6]దాశార్హునకు వరార్హుండును

  1. నివ్వటిలంగ
  2. బొక టెద్ది
  3. నిట్లుండం
  4. నయందు; నయ్యందున
  5. విధంబుల
  6. దాశార్హునికొడుకు వ్యోముఁడు గాన నిది తప్పు, వ్యోముని విడిచినఁ బరిగణనము తప్పు.