పుట:హరివంశము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

హరివంశము


వ.

ఆదిష్యంతునకు [1]గురుథాముండు ప్రభవించె వానికి [2]నాశ్రితుండు పుట్టె [3]నా
శ్రితునకుఁ బాండ్యకేరళకోళచోళు లన నల్వురు గలిగి ప్రత్యేకవంశప్రవర్తకు
లై నిజనామంబుల జనపదంబులు గావించిరి.

107


తే.

[4]ద్రుహ్యునకుఁ దనూభవుఁడు నేతుండు నాఁగఁ
బుట్టె నంగారుఁ డనఁగఁ దత్పుత్రుఁ డేచి
ధూతరిపుని మాంధాత్రునిఁ దొడరి పదియు
నాలుగు నెలలు ఘోరరణం బొనర్చి.

108


వ.

పిదపఁ దదీయసఖ్యంబు వడసి మరుభూములకుం బతియయ్యె నతనికి గాంధారుం
డనువాఁడు పుట్టి తనపేర గాంధారదేశంబు సేసెఁ దత్కులప్రభులు తురగారో
హణకుశలు లై విక్రమాదిగుణంబులం బరగిరి మఱియు ననువునకు [5]ఘర్ముం డను
కొడుకు పుట్టె [6]ఘర్మునకు ఘృతుండును ఘృతునకు దుదుహుండును దుదుహు
నకుఁ బ్రచేతసుండును బ్రచేతసునకు సుచేతసుండును సుచేతసునకుఁ బుత్రశతంబు
గలిగెఁ దద్వంశ్యు లెల్లను ధర్మవిరహితంబు లగు మ్లేచ్ఛవిషయంబులకుం బతు లై
రికం యదువంశ[7]విస్తరంబు వివరించెద.

109


తే.

యదువునకు నందనులు సహస్రదపయోదు, లనఁగఁ గ్రోష్టు[8]నీలాంజను లనఁగ నేవు
రూర్జితులు దేవసన్నిభు లుద్భవించి, రందుఁ బెద్దవాఁడైన సహస్రదునకు.

110


వ.

హైహయుండును హయుండు వేణుహయుండు నన మువ్వురు కొడుకులు పుట్టిరి
హైహయుం దొడంగి ధర్మనేత్రుండు కార్తి సహస్రజిత్తుండు మహిష్మంతుండు
భద్రశ్రేణ్యుండు దుర్దముండు ధేనుకుండు ననువారు క్రమంబునఁ గలిగిరి ధేను
కునకుఁ గృతవీర్యకృతాగ్నికృతధన్వకృతాంజను లన నలువురు సంజాతు లైరి కృత
వీర్యునకుఁ కార్తవీర్యార్జునుం డుదయించి.

111


సీ.

పదివేలవర్షముల్ పరమదుష్కర మగుతప మాచరించి యుదాత్తతేజు
నత్రితనూజు దత్తాఖ్యు నారాధించి యాతతకరుణఁ. గయ్యంబులందుఁ
జేతులు వేయును జెంద నెప్పుడు దుష్టు దండించు మహిమయు ధర్మసరణి
దప్పక పృథివియంతయు నేలుశక్తియు సకలప్రజానురంజనము వెరవు


తే.

నిష్టవరములుగాఁ గొని యేకరథమునన సమస్తధాత్రీపతులను జయించి
యేడుదివుల జన్నంబు లేడునూర్లు, ప్రగుణవైభవశ్లాఘ్యంబులుగ నొనర్చె.

112


చ.

అతని[9]మఖంబులందుఁ బ్రియమంది మహాముని యైననారదుం
డతులమహత్త్వుఁ డర్జునున కన్యులు తుల్యులె యెవ్వరు న్మహా

  1. వరుద్ధామకుండు
  2. సక్రీదుండు
  3. సక్రీదునకు
  4. దుహ్యునకు
  5. మర్ముం
  6. మర్ము
  7. విస్తరం బుపన్యసించెద
  8. నీలాంజికు
  9. మఘంబు