పుట:హరివంశము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

61


జపలయు రత్నకూటయు నను కూఁతులు పదుండ్రునుం బుట్టి. రక్కన్యకలకు నత్రి
వంశోద్భవుం డైన ప్రభాకరుం డను మహాముని భర్త యయ్యె. నతండు.

68


తే.

రాహునిహతుఁ డై యినుఁడు ధరాతలమునఁ, బడగవచ్చినఁ బడనీక పరమయశుఁడు
స్వస్తి యగుఁగాత మని పునస్స్వస్థుఁ జేసి, భువనవాసులచే నెల్లఁ బొగడు వడసె.

69


వ.

ఆతని కయ్యింతులందు స్వస్త్యాత్రేయు లను కొడుకు లనేకు లుద్భవించి విప్ర
వంశంబులకుం గర్త లైరి. మఱి కక్షేయువునకు సభానరపరమంథుచాక్షుషులు
పుట్టి. రాసభానరునకుం గాలానలుండు నతనికి సంజయుండు నాతనికిం బురంజయుం
డునుం బుట్టి. రమ్మహీపతికి జనమేజయుండు పుట్టె.

70


క.

జనమేజయునకుఁ బుట్టెను, ఘనుఁడు [1]మహాసారుఁ డన జగద్విదితుఁడు త
త్తనయుండు మహాఘనుఁ డా, యనకు నుశీనరతితిక్షు లాత్మజు లిరువుర్.

71


వ.

ఆ యుశీనరునకు నృగయయుఁ గ్రిమియు వాయయు దర్వయు దృషద్వతియు
ననుపత్ను లేవురయందును వేర్వేఱక్రమంబున నృగుండును గ్రిమియును నపుం
డును సువ్రతుండును శిబియునుం బుట్టిరి. శిబి సార్వభౌముం డై వెలసెఁ. దద్వం
శ్యులు శైబ్యు లనఁ బ్రసిద్ధు లైరి. సృగునకు యౌధేయు లను పుత్రులు పుట్టిరి.
నవునకు నవరాష్ట్రంబును గ్రిమికిఁ గ్రిమిలాపురంబును సువ్రతునకు నంబష్ఠవిష
యంబును నుపభోగ్యంబు లయ్యె. నింకఁ దితిక్షువంశంబు వినుము.

72


క.

ధీరుఁడు తితిక్షుసుతుఁడు మ, హారథుఁడు పృషధ్రుఁ డనఁగఁ బ్రాగ్దేశంబుల్
గోరి భుజియించె సుతుఁ డ, వ్వీరవరున కుద్భవించె [2]ఫేనుఁ డనంగన్.

73


క.

[3]ఫేనుఁడు సుతపుఁ గనియె న, మ్మానవపతికిని జనించె మానసజని యై
దానవబలి [4]బలి యనఁ జతు, రానను [5]పని కాత్మయోగహారివిభూతిన్.

74


వ.

అతఁడు బ్రహ్మవలన మహాయోగీశ్వరత్వంబుఁ గల్పపరిమాణం బైన యాయువు
ననేకవంశకర్తృత్వంబును వరంబులుగాఁ బడసి యంగవంగసుహ్మపుండ్రకళింగు
లను పుత్రులం గాంచె. నయ్యేవురుం దమపేళ్ల నేను జనపదంబులు గావించిరి. వారి
లోన నంగుండు.

75


క.

సుతు దధివాహనుఁ గనియెను, జితశత్రుని దివిరథాఖ్యు సృజియించె నతం
డతనికిఁ జిత్రరథుం డన, నతిరధుఁ డుదయించెఁ బుత్రుఁ డవనీనాథా.

76


వ.

ఆ చిత్రరథునకు ధర్మరథుండు పుట్టి విష్ణుపదం బను శైలంబున నధ్వరంబు నేసి
సోముని మెప్పించె. నాతనికి దశరథుం డను తనయుండు పుట్టి రోమపాదుం డను
నామాంతరంబు[6]నఁ బరఁగె.

77


క.

అజనందనుఁ డగు దశరథుఁ, డజితుఁడు దనకూఁతు శాంత యనుకన్యఁ బ్రియా
త్మజఁ గా నొసఁగఁగఁ గైకొని, సుజనప్రియుఁ డాత్రిలోకసుందరమూర్తిన్.

78
  1. మానశాలు
  2. వేను
  3. వేనుఁడు
  4. యన నాచతు
  5. పని నాత్మ
  6. నుఁ గలిగి