పుట:హరివంశము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

హరివంశము


భోగములమీఁదితృష్ణ యుప్పొంగ[1]సుతులఁ, బెంపు శోభిల్లఁ బిలిచి సంప్రీతితోడ.

56


క.

తనముదిమిఁ బుచ్చికొని యౌ, వన మిం డని వేఱువేఱ వారల నర్థిం
చిన నెవ్వరు నీరై రా, జనపతి నలువురకు నిచ్చె శాపము లోలిన్.

57


క.

[2]కడపటివాఁ డగు పూరుం, డడుగక[3]మును దండ్రి కాత్మయౌవన మిచ్చెన్
గడుసంతసమునఁ గైకొని, యడరెడు రాగంబుతోడ [4]నతివలుఁ దానున్.

58


తే.

దేవయానసమేతుఁ డై దేవచరిత, భూములందుఁ బ్రభూతసంభోగరుచులఁ
పెద్దగాలంబు విహరించి పెరుగుచున్న, కామమున కేమిటను గడ గానలేక.

59


వ.

క్రమ్మఱం బూరుపాలికి వచ్చి యతని యౌవనం బతనిక యిచ్చి యాత్మీయం బగు
జరాభారంబు వహించె. కామోద్దేశంబు లగు వానిం బేరుకొని సుభాషితంబు
లి ట్లని యుదాహరించె.

60

యయాతిమహారాజు పఠించిన సుభాషితంబులు

తే.

అంగములు కూర్మ మెట్లు ప్రత్యాహరించు నట్లు, కామము [5]దమయంద యడఁపఁజాలు
ధన్యచిత్తుఁ డానందతత్త్వంబు నొందు, నితరు లెల్లఁ గాలగ్రస్తు లింత నిజము.

61


క.

పసిఁడియు బశువులు భామలు, వసుమతిమీఁదఁగలయంతవట్టు నొకఁడ యిం
పెసఁగఁగఁ [6]బడసియుఁ దనియఁడు, విసువ[7]వలదె తృష్ణవలన విరతిప్రాప్తిన్.

62


క.

సమధికభోగంబులచే, సమయుం గామ మనునది మృషావాదం బా
జ్యమునం దోడ్తో ననలం, బమితం బై యొదవుఁగాక యాఱునె యెందున్.

63


క.

అని పలికి వనంబునకుం జని దేవీసహితుఁ డై యసామాన్యతపం
బొనరించి సిద్ధసేవిత, వినుతగతుల నవ్విభుండు వెలుఁగొందె నృపా.

64


వ.

అని యిట్లు పరమపావనం బగు యయాతిచరితం బెఱింగించిన.

65


క.

విని జనమేజయవిభుఁ డి, ట్లను నస్మద్వంశమునకు నాద్యుఁ డయిన పూ
రునివంశశాఖ లన్నియు, వినవలతుం జెప్పవే పవిత్రచరిత్రా.

66


క.

నావుడు నమ్ముని యి ట్లని, యావిభునకుఁ జెప్పుఁ బూరునాత్మజుఁడు గుణ
శ్రీవిలసితుఁడు ప్రవీరుఁడు, నా వెలసె మనస్యుఁ డతని నందనుఁడు నృపా.

67


వ.

అమ్మనస్యునకు నభయదుండును వానికి సుధన్వుండును సుధన్వునకు సుబాహుం
డును సుబాహునకు రౌద్రాశ్వుండునుం బుట్టిరి. రౌద్రారాశ్వునకు ఋచేయువు
దశార్గేయువు కృకణేయువు కచేయువు స్థండిలేయువు సన్నతేయువు జలేయువు
స్థలేయువు వనేయువు వననిత్యుండు నను పదుండ్రు కొడుకులును రుద్రయు
శూద్రయు భద్రయు మలహయు దలదయు సులభయు నలదయు సురసయుఁ

  1. నాత్మ, జాతు లందఱ
  2. కడపుట్టువాఁడు
  3. మున్న తగ నాత్మ
  4. నన్నరపతియున్
  5. ల్దమ
  6. నెవ్వఁడు
  7. దగదె