పుట:హరివంశము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

59


బొలియింపంగఁ దొలంగి పోయె రజి యుద్భూతప్రభావోగ్రుఁ డై
బలవిద్వేషి పునఃప్రతిష్ఠ గనియెం బ్రాజ్యస్వరాజ్యంబునన్.

49


క.

శతమఖరాజ్యావాప్తి, ప్రతిపాదక మైన యీయుపాఖ్యాన[1]ము వి
శ్రుతమై దీర్ఘాయురరో, గతలును దురితాపగమముఁ గావించు భువిన్.

50

యయాతిమహారాజుచరిత్రంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

వ.

అని చెప్పి వైశంపాయనుం డి ట్లనియె. నహుషునకు యయాతియు సంయాతియుఁ
బ్రయాతియు ననువారు పుట్టి. రందు యయాతి శుక్రపుత్రి యైన దేవయాని
యిందు యదుతుర్వసు లనువారి నిద్దఱను వృషషర్వపుత్రి యైన శర్మిష్ఠయందు
[2]ద్రుహ్య్వనుపూరుల ననంగా మువ్వురం బుట్టించి యైశ్వర్యంబున ననిమిషేశ్వర
సదృశుండై వెలింగె.

51


చ.

అనుపమదివ్యవాహయుత మైన రథంబు సురేంద్రుఁ డాదరం
బున నొనఁగంగఁ [3]గాంచి యిరుమూఁడుదినంబుల సర్వభూతలం
బును నతఁ డేలెఁ దత్సుతుఁడు పూరుఁడు లోనగు వైన్యు లెల్ల న
జ్జనపతియట్ల యమ్మహితసాధన నేలిరి పేర్మి యొప్పఁగన్.

52


వ.

[4]పెక్కబ్దంబు ల ట్లరిగినం బారిక్షితుం డగు జనమేజయుండు గర్గతనయుం డగు
బాలుం బ్రమాదంబున వధియించి బ్రహహత్యఁ దగిలి లోహగంధి యగు దేహం
బుతోఁ బౌరజానపదులచేతం బరిత్యక్తుం డయి తిరుగుచు శౌనకుం డను మహా
ముని నాశ్రయించి యతండు తురగమేధంబు సేయింపం గిల్బిషంబువలనం బాసె.
మున్ను పాతకి యైనప్పుడ యాదివ్యస్యందనం బంతర్ధానం భై నిలువక నాకంబు
నకుం బోయిన.

53


క.

ఉపరిచరవసువునకు నె, య్యపువెరవున నింద్రుఁ డిచ్చె నత్తే రాచే
దిపతివలన మగధనరా, ధిపుఁడు బృహద్రథుఁడు వడసెఁ దేజం బెసఁగన్.

54


వ.

తత్సుతుం డగు జరాసంధు వధియించి భీముండు వాసుదేవున కిచ్చె. నట్లు యయాతి
సప్తద్వీపంబులుం దన బాహుబలంబున సాధించి.

55


సీ.

[5]పూర్వోత్తరం బగు పుడమికి [6]నొడయుఁగా నొనరించి యదునగ్రతనయు నిలిపె
దక్షిణపూర్వమై తనరుదేశమునకుఁ బ్రభువుఁగాఁ జేసి తుర్వసుని నిలిపెఁ
బశ్చిమోదగ్భూమిభాగముల్ రెంటికి నధిపతులుగ ద్రుహ్యు ననుని నిలిపె
మధ్యమం బై యొప్పుమండలంబునఁ బరిస్ఫుటభూతిగంభీరుఁ బూరు నిలిపె


తే.

సకలరాజ్యంబు [7]సుతులకు సత్కరించి, తాను సన్యస్తశస్త్రుఁ డై తనరు విషయ

  1. మను
  2. ద్రుహ్యుండు ననుండునుఁ బూరుండు నను మువ్వురిం
  3. గ గెల్చి
  4. పెక్కుతరంబు. పెక్కుతెఱంగులం దిరిగిన
  5. పూరుని మధ్యమభూమికి నధిపుగా నభిషేక, మొనరించె నవనినాథు, లేక, పూరుని ...మికి రాజుగా న....రించె నధిపుఁ డట్లు
  6. నొడయుఁగా నొనరించి
  7. పుత్రుల