పుట:హరివంశము.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

హరివంశము


మ.

[1]వినమత్కారుకమేఘముక్తనిశిఖోద్వేలాంబుధారావళిన్
దనుజాంభోజవనీ[2]సహస్రముల విధ్వంసంబు నొందించి య
య్యనపాయుండు తదాశ్రయస్థ మగు నుద్యద్రాజ్యలక్ష్మిన్ సుధా
శనగేహంబున శాశ్వతంబుగఁ బ్రతిష్టాపించెఁ బెం పేర్పడన్.

39


వ.

అప్పుడు పురుహూతుండు.

40


క.

నీ వింద్రుఁడ వై తొడఁబా, టీవిధ మగుటను నరేంద్ర యేఁ బుత్రుఁడ నై
నీవిభవమునకు యుక్తుఁడఁ, గావలవదె యనిన నల్ల కా కని రజియున్.

41


వ.

దివంబున నుండి దేవేంద్రలక్ష్మి యనుభవించెఁ. దత్పుత్రు లందఱు భూలోకంబు
విడిచి నాకలోకంబునక పోయి శతక్రతుండు తోడంబుట్టు వగుట నతనిఁ దమ
లోన నొకని[3]తోడి వాలివానంగాఁ జేసి యఖిలరాజ్యంబును దార యాక్రమించి
సర్వలోకంబును భుజియించి. రట్టి ప్రవర్తనంబుల బహుదీర్ఘం బగు కాలంబు గడచె.
నివ్విధంబున.

42


క.

సిరిఁ బాసి వాసవుఁడు దన, గురుఁ గానఁగ నరిగి యతనిగురుతరచరణాం
బురుహముల కెరఁగి [4]యపరి, స్ఫురితము లగుగద్గదోక్తముల ని ట్లనియెన్.

43


మ.

రజిచే గద్దియ గోలుపోయి విభుతాభ్రష్టుండ నై క్రమ్మఱన్
రజిపుత్రావళి యాక్రమంబున ననర్థంబుల్ పొరిం బైకొనన్
నిజమై యెందును నిల్వనేరక విపన్నిర్మూఢతం దూలెదన్
సుజనశ్రేష్ఠ యొకింత నాదెస కృపం జూడందగుం జూడవే.

44


క.

మదిలో [5]నన్నుఁ దలంచుచు, బదరీఫలమాత్రహవ్యభాగ మనలునం
దొదవించితేనియును న, భ్యుదయము నే నొంది మూరిఁబోవనె చెపుమా.

45


చ.

అనిన నతండు నీవు నను నక్కట యిం తన నేల మున్న యీ
పని యెఱిఁగించితేని నశుభంబులు నీదెసఁ జేరనిత్తునే
విను మిటసూడు సర్వమును వేగమె మేలుగ నుద్వహించెదన్
మనమున శంకఁ దక్కు మనుమానము మానుము లేదు భారమున్.

46


వ.

అని యతని నాశ్వాసించి విశ్వక్రియాధుర్యుం డగు నయ్యాచార్యుండు తదీయ
తేజోవృద్ధివిధాయియుఁ బరప్రభావపరిభావియు నగు ననుష్ఠానంబు నిర్వహించిన.

47


క.

రజిసుతులు కామరోష, ప్రజనితదర్పమున మోహపరులై ధర్మ
త్యజనంబు సేసి సాధు, ద్విజవిద్వేషాదిదురితవృత్తిఁ దగిలినన్.

48


మ.

బలముం దేజముఁ దప్పి పోవుటయుఁ గోపం బార జంభారి యు
జ్జ్వలదంభోళిఁ బరాక్రమించి పటుగర్వస్ఫూర్తి నయ్యందఱం

  1. విను తత్కార్ముకమధ్యయుక్త
  2. సహస్రకము
  3. తోటి
  4. యపవి
  5. న నిన్ను దలంచుచు