పుట:హరవిలాసము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 71



బ్రమథగణములు సేయు ధౌర్త్యంబు నెఱిఁగి, దారుకావని కరుగంగఁ దలఁచె నపుడు. 17

వ. ఇట్లు దలంచి నందివాహనారూఢుండును గతిపయప్రమథపరివారపరివృతుండును నై మామ వీడుకొనక గౌరికిం జెప్పక నభోమార్గంబునఁ దత్పర్వతైకదేశస్థితం బగు దేవదారువనంబుం బ్రవేశించె నప్పర్వతం బెట్టిదనిన. 18

సీ. వృద్ధకచ్ఛపరాజువీఁ పంఘ్రిపీఠంబు సురతరంగిణివెల్లి శిరసుపాగ
మహిమండలమునకు మానదండము మేను పూర్వాపరంబులు పొరుగుటిండ్లు
కాత్యాయనీదేవి కన్యకారత్నంబు బేసికన్నులవేల్పు పెండ్లికొడుకు
పొలనీయము శేషశైలసామ్రాజ్యంబు యాగహవిర్భాగ మోగిరంబు
తే. మాల్యవన్మేరుకైలాసమలయసహ్య, గంధమాదనమందరక్రౌంచవింధ్య
భూధరంబులు చుట్టాలు పొగడఁ దరమె, సకలగుణధాముఁ బర్వతసార్వభౌము. 19

క. అందు విహరించుఁ గాంచన, కందరమందిరములందుఁ గౌతుక మొప్పన్
బృందారకమిథునంబులు, కందర్పవిహారములఁ బగళ్లును రేలున్. 20

ఉ. ఎంచి నుతింప శక్యమె యహీశ్వరునంతటివానికైన ర
త్నాంచితరోచిరుద్దమనిరస్తరవీందుమరీచిజాలమున్
గాంచనకందరాయవనికాయితవారిధరాంతరాళ ని
ర్వంచితదేవతామిథునవాంఛితమూలము శీతశైలమున్. 21

తే. హేమశైలంబు దోఁగ్ధగా భూమి సురభి, నఖిలరత్నౌషధులును గల్పాదియందుఁ
బృథుమహారాజుపంపునఁ బితికె నెలమి, మంచుగొండను బెయ్యఁ గావించి గిరులు. 22

శా. ఆమోదంబున వేఁటలాడుదురు నీహారాద్రికాంతారరే
ఖామధ్యంబునఁ జాపటంకృతులతో గంధద్విపశ్రేణులన్
క్షౌమక్షామమనోజ్ఞమధ్యమలు గుంజాభూషణాలంకృతల్
వ్యామగ్రాహ్యపయోధరల్ శబరసేనాధీశసీమంతినుల్. 23

క. మృడుమేనిసాము కూఁతురు, జడనిధిచెలికాఁడు కొడుకు సర్వంసహకున్
గొలకోల కడలికడలకు, వడఁకులగుబ్బలికి సరియె వసుధాధరముల్. 24

క. ఆటవికభామినీభుజ, తాటంకితదీర్ఘదీర్ఘతరవేణుధను
ర్జ్యాటంకారధ్వనిపరి, పాటీముఖరములు తుహీనపర్వతతటముల్. 25

వ. మఱియు జాహ్నవీనిర్ఝరధారాఝాత్కారఘుమఘుమాయితమణిగుహాకుహరంబును వనమహిషకోణాభిఘాతప్రస్నిగ్ధపాషాణస్ఖలనరోహద్గర్భిణీగర్భపాతంబును శబరఫురంధ్రినీరంధ్రకుచకలశలేపనముద్రాయోగ్యవర్ణవర్ణనీయగైరికశిలాచూర్ణంబును గిన్నరమిథునక్రీడాసంకేతనికేతనాయమానకనకకేతకీకుంజక్రోడంబును గంధర్వకన్యకానఖముఖస్ఫాల్యమానవీణాగుణక్వాణసంగీతభంగీతరంగితాంతరంగవనకురంగంబును