పుట:హరవిలాసము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

7

"తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మి!” యనుకర్ణాటదేశ మాతృసంబోధసము తన కాశ్రయులగు కొండవీటిరెడ్లు, రాజమహేంద్రవరపురెడ్లు, తెలుఁగురాయఁడు, మైలారిరెడ్డి మున్నగువారు స్వర్గస్థులయినపిదకు వార్ధక్యములోఁ గన్నడరాజ్యమున కేగినపు డాకాలస్థితినిబట్టి వారు తన్నాదరింపకుండఁగ "తల్లీ! దయలేదా? నేను డిండిమభట్టారకు నోడించిన శ్రీనాథుఁడ” నని తన్నెఱుకపఱుచుకొని యుండచ్చుననియు,

“కాల్పట్టణాధీశ్వరున్” అనుచో నాకాల్పట్టణము కర్ణాటరాజ్యములోని దైనట్లు నిదర్శనములు లేనందున నాయుక్తి విశ్వాసపాత్రము గాదనియు నిట్లు పైకారణముల ఖండించి శ్రీనాథుఁడు పాకనాఁడు జన్మస్థానముగాఁ గలయాంధ్రుఁడని చెప్పఁబడియున్నది.

ఈయుభయవాదహేతువులందును బలవత్తరమగువినిగమనము గనఁబడక పోయినను మఱికొన్ని కారణములవలనను జనశ్రుతివలనను నాంధ్రచరిత్రకారుల యభిప్రాయమే సమంజస మని తోఁచుచున్నది.

ఇద్దాని కుపబలముగా శ్రీనాథుని బంధువు లందఱు నాంధ్రదేశములోని యాంధ్రులుగనే యున్నారు. కాని కర్ణాటకుఁ డొక్కరుఁడైన నున్నట్లు తెలియఁబడదు.

నాచికేతోపాఖ్యానమును రచించి యుదయగిరిదుర్గాధీశుఁడగు చిట్టి గంగామాత్యునకుఁ గృతియిచ్చిన దగ్గుపల్లి దుగ్గయామాత్యుఁడు శ్రీనాథునిభార్యకుఁ దోఁబుట్టువు. శ్రీనాథునకు శిష్యుఁడు. ఈ గ్రంథమును ఓరియంటల్ లైబ్రరిలో నేఁ జదివియున్నాఁడను. ప్రౌఢముగా రసవంతముగానే యున్నది.

రాజమహేంద్రవరాధిపతి యగువీరభద్రభూపాలునిమంత్రి బెండపూడి యన్నామాత్యుఁడు.—

"వినిపించినాఁడవు. వేమభూపాలున, కఖిలపురాణవిద్యాగమములు
....... ....... ........ ........ ....... ........

పాకనాటింటివాఁడవు బాంధవుఁడవు
కమలనాభునిమనుమఁడ వమలమతివి
నాకుఁ గృపసేయు మొకప్రబంధంబు నీవు
కలితగుణధన్య శ్రీనాథకవివరేణ్య."