పుట:హరవిలాసము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము 109

రోదసీనిరంతరాకాలసంపాదితోడుభ్రమంబును నమలడిండీరపిండఖండమండితాఖండపాండుర్యధుర్యరోచిరనిశసాంద్రచంద్రికాక్రాంతదేశదిశాభాగంబును వితతవిద్రుమలతానికుంజపుంజసమభిరంజితప్రదేశనిర్దిష్టసంతతాదిష్టచరమసంధ్యావిశేషరాగంబును గమఠఝషకుళీరతిమితిమింగిలాదిసత్త్వసంపాతసంభృతాచ్ఛోదితధ్వనినిలీననిఖిలచేతనారవంబును దటవిధూతపాతవికిరదవిరళపరాగవినిభృతద్విరేఫకుసుమమంజరీవిశాలలవలీలవంగలుంగలతాలాస్యవిభవంబును బక్షభూభృదవిరతప్రచారాభిషవణంబును నమేయవాహినీవధూముఖప్రసక్తభూషణంబును నగు మహాసముద్రంబు డగ్గఱి తదీయోదరంబున. 155

చ. కనియెఁ బురంబు నమ్రమణికాంచనసౌధము నత్యుదగ్రసా
ధనము నసాధ్యశిల్పఘనదారుణసాలము నద్భుతైకస
జ్జనసముదగ్రఘట్టము విశాలతరాట్టము నుద్భటారిత
ర్జనము ననల్పగర్జనసురద్విషదుజ్జ్వలితంబు నిమ్ముగన్. 156

మ. కని యత్యుద్ధతి శంఖ మొత్తుటయు నాకంపించె ధాత్రీతలం
బనిలస్కంధము లేడు చిక్కువడియె న్యాదోనిధు ల్డిందె ఘూ
ర్ణవముం బొందె సురేంద్రలోకములు విన్నంబోయెఁ బాతాళము
ల్వినియోగంబులు దప్పె భూతచయము ల్వ్రీలె న్దిశాభాగముల్. 157

వ. ఇట్లు యుగవిగమసమయఘనఘనాఘనకఠోరదీర్ఘతరశతసహస్రభైరవం బగునమ్మహారవంబు కర్ణశూలంబై తాఁకినఁ గనలి దానవులు హల ముసల పరశు పట్టిన ప్రాస పరిఘ ముద్గర ముసుండి దండ కోదండ కుంత కులిశ భల్ల భిందినాల శంఖ శక్తి కర్తరీ కఠార కుఠార లవిత్ర తోమర త్రిశూల ఖట్వాంగ చక్ర చంద్రహాస మహాంకుశ గదాపాశ పాషాణ ప్రముఖంబు లగు మహాస్త్రశస్త్రంబులు వహించి వికటగ్రజారవభరంబున నంబరంబు పిక్కటిల్ల నొక్కపెట్ట యమ్మహానగరంబు వెడలి తదీయస్యందనంబుఁ జుట్టముట్టి. 158

మ. ఘనశస్త్రాస్త్రమహాతివర్షము నొగి న్గర్జామహాడంబర
ధ్వనిసంవీతఘనాఘనౌఘనిసతద్ధారాళధారామహా
శనివర్షంబుల ద్వంద్వ మొందఁ బయిపై సంరంభశుంభద్గతి
న్వనధుత్ ఘూర్ణిల బిట్టు వాసవిపయి న్వర్షించె నొక్కుమ్మడిన్. 159

క. వాలికెమెఱుంగుఁదూపులు, నాళీకోదరునిమఱఁది నలిదైత్యులమైఁ
గీలించెఁ బేరుపేర, న్ఫాలమునఁ బదేసికంకపత్రములు వడిన్. 160

మ. అలుకం దానవు లొక్కయుమ్మడి తదీయస్యందనోరుద్యుతి
స్ఖలనంబు న్సురసిద్ధచారణమహాశ్చర్యంబు గావించుచు