పుట:హరవిలాసము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

11


యని సంశయము ఉండిన నుండుగాక వీథినాటకము గూడ నీకక్ష్యలోనిదే.

ఈగ్రంథములలో బండితారాధ్యచరిత్రమును వేమారెడ్డిసేనానాయకుఁడగు మామిడి ప్రెగడయ్యకును, నైషధము నాతనితమ్ముఁడగు సింగనమంత్రికిని, భీమేశ్వరఖండమును వీరభద్రారెడ్డి మంత్రియగు బెండపూడి యన్నయ్యకును, కాశీఖండమును వీరభద్రారెడ్డికి నంకితము చేసెను ఈ గ్రంథముల పౌర్వాపర్యములను విచారింప కాశీఖండములోని

‘చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు రచియించితిని మరుద్రాట్చరిత్ర’

అను పద్యమువలనను, శృంగారనైషధములోని---

“క. జగము నుతింపఁగఁ జెప్పితి, ప్రెగడయ్యకు, నాయనుంగుఁ బెద్దనకుఁ, గృతుల్
నిగమార్థసారసంగ్రహ, మగు నా యారాధ్యచరిత మాదిగఁ బెక్కుల్.”

అను పద్యమువలనను. జిన్ననాఁటినుండి మహాకవియై 18 సం. వయస్సున మరుత్తరాట్చరిత్రయు, 20 సం. న శాలివాహనసప్తశతియు, 21 సం. న పండితారాధ్యచరిత్రయు, 30-31 సం.ల శృంగారనైషధమును, 40 సం. న భీమఖండమును, 44 సం. న కాశికాఖండమును రచించియుండునని తోఁచుచున్నది.

హరవిలాసము.

ఇది 7 ఆశ్వాసముల ప్రబంధము. పైగ్రంథములలో నెయ్యెడ నిది పేర్కొనబడనందున గాశికాఖండమునకు బిదప రచించె ననవలసియున్నది. అన్ని గ్రంథములకన్న స్వాభావికమగుకవితాశైలియు నీవిషయమునే బలపఱుచుచున్నది. ఇయ్యది క్రీ. శ. 1370 సం. మొ 1391 సం. వఱకుఁ గొండవీటిసీమఁ బాలించిన వేమారెడ్డి కాలములో బాలుఁడై వేమారెడ్డిపుత్రుం డనపోతరెడ్డి సేనాధిపతియై యుద్ధములో మడియుటచే నాతనియనంతరముననే రాజ్యమునకు వచ్చిన కొమరగిరి భూపాలుని సుగంధద్రవ్యభాండాగారాధ్యక్షుఁడైన యవచి తిప్పసెట్టి కంకిత మీఁబడినది. హరవిలాసములో నీతడు 'మంటి బహువత్సరంబులు’ అని చెప్పుకొనుటచేఁ గృతినందునాఁటికి 65 సం. వయసువాఁడైయుం