పుట:హంసవింశతి.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సకినెల పట్టెమంచమునఁ జాయనఖాసు తివాసిపైఁ దురం
గిక మొకమాలు లేపున నొగిన్ శయనించి మనోభవవ్యథన్. 69

క. ప్రీతిని హేమావతిపై
నాతీరున మనసు నిలిపి యతివిరహార్తిన్
జేతోజాతధనుర్భవ
శాతశరవ్రాతసారచకితాత్మకుఁడై. 70

క. ఉలుకున్ వెన్నెలవేఁడిమి
కలుకున్ శుకపికమిళిందహంసార్భటికిన్
బెళుకున్ మలయానిలునకు
జెళుకున్ బూఁబాన్పునందుఁ జిరవిరహార్తిన్. 71

ఉ. చెక్కిటఁ జేయిఁ జేర్చుకొని చింతిలు నుస్సురటంచుఁ జూపులన్
వెక్కసమంది లేమ సరవిన్ బొడగట్టినయట్టు లుండఁగా
నక్కునఁ జేర్పఁబోవు భ్రమమంది వెసన్ దలయూఁచు నంతలోఁ
బక్కున నవ్వు నింతిపయిబాళి నృపాలకమౌళి ఖిన్నతన్. 72

వ. మఱియు నారాజు విరహంబు తాపాతిశయకరంబు గావున నిదాఘంబును, విరళీకృతాశ్వాసంబు గావున సత్ప్రబంధంబును, విచ్ఛిన్నాలంకారంబు గావున యవనవివాహంబును, నిమీలితతారకంబు గావున నహర్ముఖంబును, విప్రలాభముఖరంబు గావున సాయంకాలంబును ననుకరించె నప్పుడు. 73

క. అటువలె నృప నిటలాక్షుఁడు
పటుతరవిరహంబుఁ జెంది బాధపడంగా
నటనమున హేల యనియెడు
కుటిలాలక వచ్చెఁ దెలివిఁగొనఁజేయుటకున్! 74

శా. పన్నీట న్నయనంబు లొత్తెఁ దనువున్ బాటీరపంకంబుతోఁ
జెన్నారన్ బదనిచ్చె గీరి సిగవేసెన్ దాయెతుల్ సుట్టె జీ