పుట:హంసవింశతి.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిప్పిలి పర్వఁగా నమృతశీకరముల్ వడిఁ గ్రుమ్మరింప న
ప్పప్ప యిదౌర యంచు జనులందఱు నౌఁదల లూఁచి మెచ్చఁగన్. 34

తే. చెప్పుచుండఁగ భామల చిత్తవృత్తి
తెలియ బ్రహ్మకైనను గొలఁదిగాదు
ధాత్రిఁ జిత్రవిచిత్రంబు దలఁచిచూడ
దాని నెఱిఁగింపు బ్రాహ్మణోత్తమ మృగాంక! 35

వ. అని యడిగిన నతనికిఁ బురోహితుం డిట్లనియె. 36

క. మంకులు మాయోపాయలు
బొంకులపుట్ట లతిపాపపుం జగజంతల్
జంకెనలు సేయు యువతులు
శంకరుఁడున్ దగఁడు వారి చర్యలు దెలియన్. 37

తే. అయిన నొకకథ కలదు రాజాగ్రగణ్య!
తొల్లి పరమేశ్వరుండు సంతోష మొదవఁ
బార్వతీదేవి కెఱిఁగించె బాగుమీఱ
నది యెఱింగింతు వినుము నీ వవధరించి. 38

వ. అని యిట్లనియె. 39

సీ. మంజులమాణిక్యపుంజరంజితఘన
ప్రాకారచుంబితాభ్రస్థలంబు
చంద్రకాంతోపలసౌధపాండురకళా
మ్రేడితప్రాలేయఘృణికరంబు
రత్నకుడ్యావళీరమ్యాంశుసందోహ
బహుళీకృతార్కప్రభాచయంబు
గంభీరపరిఘాసితాంభశ్చటాతమో
లోకీకృతాధరలోకవితతి
తే. యామికాహతిజాతదిశాధినాథ
పురభయంకరభేరికాభూరిదంధ