పుట:హంసవింశతి.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లంబు గావునఁ గిష్కింధానగరంబును, గుంభీనసరభసంబు గావున రసాతలంబును, గంధర్వప్రచురంబు గావున దేవలోకంబును, గురుగవిబుధద్విజరాజభాసమానంబు గావున గ్రహమండలంబును ననుకరించి మత్స్యకూర్మాదిమహిమంబులు వహించి కమలాలంకృతంబులై శ్రీమహావిష్ణువుం బురుడించు సరోవరంబులు గలిగి యొప్పు నెప్పుడు. 27

ఉ. ఆపుర మేలు మేలు భళి యంచు నుతింప జనుల్ నవద్వయ
ద్వీపవసుంధరాస్థలి నుదీర్ణజయాంకలిపు ల్లిఖించి, బా
హాపటుశక్తి నిల్పిన మహారజతద్యుతు లొల్కు కంబముల్
ప్రాపితశౌర్యలేఖలయి ధాసిలఁగా నలనాముఁ డున్నతిన్. 28

తే. ప్రబలరాజాధిరాజ వీరప్రతాప
రాజ పరమేశ్వరాష్టదిగ్రాజకుల మ
నోభయంకరబిరుదైకవైభవా య
టంచు మాగధు లెంచంగ మించు నతఁడు. 29

వ. ఇట్లు మహీశాసనంబు సేయుచు నొక్కనాఁడు. 30

ఉ. ఆ తరణీప్రభుండు గొలువై చెలువై బలవైరిభోగసం
ప్రీతి దలిర్పఁగా నృపవరేణ్యులు మాన్యు లగణ్యపుణ్యసం
ఘాతు లమాత్యు లార్యు లధికారులు వీరులు చారు లష్టది
గ్జాతవిచిత్రవస్తువులు గానుక దెచ్చినవారు గొల్వఁగన్. 31

క. ఉన్నయెడ నాల్గువేదము
లెన్నఁగఁదగు శాస్త్రచయము లితిహాసాదుల్
పన్నుగఁ దెలిసిన ప్రత్యు
త్పన్నమతి యనెడు పురోహితద్విజుఁ డెలమిన్. 32

ఉ. వచ్చి ఫలోపవీతములు “స్వస్తిచ తేఽస్త్వితి”సూక్తి మున్నుగా
నిచ్చిన నాదరించి వసియింపఁగఁజేసి నృపాలుఁ డెంతయున్
ముచ్చటయున్ బ్రసంగములు మున్పటిరాజుల చర్యలున్ గథల్
చెచ్చెర నానతిమ్మనినఁ జిత్తము రంజిల నాతఁ డత్తఱిన్. 34

ఉ. చెప్పఁదొడంగెఁ దేనియలు చిల్కఁగ ద్రాక్షలు రాలఁ గప్రపుం
దిప్పలు చిమ్మిరేఁగఁ గడుఁదీయని యిక్షురసప్రపూరముల్