పుట:హంసవింశతి.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ. అంకితంబుగా రచియింపబూనిన హంసవింశతి యను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన. 23

కథా ప్రారంభము.

2సీ. నానాగమస్ఫూర్తిఁ బూని హంసాశ్వస
న్మహిమంబుఁగను ధరామరులు హరులు
తేజోమదంబుల దిక్కుంభినీశుల
నురుమాడనోపు భూవరులుఁ గరులు
మణిచక్రములు భూరిగుణకోటి కేతువు
ఖలరఁగా నొప్పు వైశ్యులు రథములుఁ
బరజీవ జీవనోద్ధరణధర్మఖ్యాతి
విలసిల్లు శూద్రులు వీరభటులు
తే. విమల సుమనఃప్రమోదరాగములఁ దనరి
పల్లవప్రాప్తిచే మించు ప్రౌఢవార
వనిత లారామములు గల్గి వినుతికెక్కు
భూమిరత్నంబు నైషధపురవరంబు. 24

క. కలిత మహాబల సఖ్యో
జ్జ్వలవిక్రమనిహతవిమతసాలోరుయశోఽ
నలరాజభరిత మప్పుర
తిలకము సమమనఁగవచ్చుఁ దేజోవతికిన్. 25

క. ఆపురము ధరాలలనా
నూపురమై రత్నసౌధనూతనరుచికిన్
దాపురమై యభ్రంకష
గోపురమై పొగడ నెగడుఁ గుంభినిలోనన్. 26

వ. మఱియు నప్పట్టణంబు దివ్యసాలోచ్ఛ్రయకలితంబు గావున నాకలోకంబును, మహాశుద్ధాంతరంగంబు గావున యోగిజనంబును, నీలగవాక్షప్రబ